Vijay Deverakonda: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్ళు సైతం టాలెంట్ లేక చల్ అంది ఇక్కడ తట్టాబుట్టా సర్దుకున్నారు… కానీ ఎలాంటి సపోర్టు లేకుండా సోలోగా ఇండస్ట్రీ వచ్చి స్టార్ హీరోలుగా మారిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు… పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస సక్సెస్ లను సాధించిన విజయ్ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకొన్నాడు. కానీ కొన్ని రోజుల నుంచి ఆయన చేస్తున్న సినిమాల్లో చాలా లోపాలు జరుగుతున్నాయంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం ‘ గౌతమ్ తిన్ననూరి’ దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్ డమ్’ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తాడు.
అనుకున్నప్పటికి అది ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తన అభిమానులు సైతం ఆయన సినిమాని చూడడానికి ఆసక్తి చూపించలేదు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆయనలో మంచి ఫైర్ ఉండేదని దానివల్ల మంచి సినిమాలు చేయడానికి ఆయన ట్రై చేశారు.
కానీ ఇప్పుడు కమర్షియల్ బాట పట్టి అనవసరమైన సినిమాలు చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి విజయ్ లో ఈ మధ్య కాలంలో ఫైర్ కనిపించడం లేదని కూడా చాలా మంది సినిమా మేధావులు చెబుతూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు రవి కిరణ్ దర్శకత్వంలో చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’ అలాగే రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేయబోతున్న మరొక సినిమా ఈ రెండు సినిమాలతో ఆయన సూపర్ సక్సెస్ లను సాధిస్తే మరోసారి కం బ్యాక్ ఇచ్చినట్టుగా అవుతోంది.
లేకపోతే మాత్రం విజయ్ దేవరకొండ కెరియర్ చాలా వరకు డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తను కనక ఇలాగే చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇప్పుడొస్తున్న యంగ్ హీరో సైతం విజయ్ దేవరకొండని బీట్ చేస్తూ ముందుకు దూసుకెళ్ళే అవకాశమైతే ఉంది. కాబట్టి ఎలాగైనా సరే విజయ్ సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరం ఉంది. ఇక ఇదంతా చూస్తుంటే విజయ్ త మీదున్న బాధ్యతను తన సక్సెస్ఫుల్గా నిర్వహిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…