Balakrishna Gopichand Malineni Movie: నందమూరి నట సింహం గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు బాలకృష్ణ… కెరియర్ స్టార్టింగ్ లో అన్ని రకాల సినిమాలను చేస్తూ ముందుకు సాగిన ఆయన ప్రస్తుతం మాస్ సినిమాలను మాత్రమే ఎక్కువగా చేస్తున్నాడు. కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్న బాలయ్య ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాతో మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమా మీద ఇప్పటినుంచే అంచనాలైతే తారా స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇక ఈ క్రమంలోనే బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరొక సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద బాలయ్య బాబు చాలా కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా షెడ్యూల్లో బాలయ్య బాబుకి గోపీచంద్ కి మధ్య కొద్దిపాటి విభేదాలైతే వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. కారణం ఏంటి అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికి బాలయ్య గోపీచంద్ మలినేని మీద కొంచెం ఫైర్ అవుతున్నాడట. ఇక ఈ గొడవ ఎప్పుడు సర్దుమనుగుతోంది.
ఈ సినిమాకి మరోసారి సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాతో బాలయ్య మరోసారి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాని చేయడం విశేషం… ఇంతకుముందు ఆయన చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతోంది. కాబట్టి ఇందులో వార్ ఎపిసోడ్స్ కూడా భారీగానే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా అన్ని అవాంతరాలను ఎదుర్కొని మరోసారి సెట్స్ మీదకి వెళ్తుందా లేదంటే ఈ మూవీని ఆపేయబోతున్నారా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటి వరకు బాలయ్య చేసిన సినిమాల్లో ఈ సినిమా డిఫరెంట్ గా ఉండబోతోందట. ఇక ఇప్పుడు ఆయన ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని తన అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…