Samantha: సమంత మరలా ప్రేమలో పడ్డారా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. ఆమె తాజా సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు కారణమైంది. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పర్సనల్ విషయాలతో పాటు తన సినిమా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అంతకంటే ఆమె ఇండైరెక్ట్ కోట్స్, సైటైర్లు వార్తలకు ఎక్కుతూ ఉంటాయి. లోతు అర్థంతో కూడిన సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ అనేక సందేహాలకు కారణం అవుతాయి. ఇటీవల సమంత తాను ధరించిన టీషర్ట్ పై ఉన్న ఇంగ్లీష్ కొటేషన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఆ టీ షర్ట్ పై ”యు విల్ నెవర్ వాక్ అలోన్” అని రాసి ఉంది. దానర్థం నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ప్రయాణం చేయలేవు అని. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక నెటిజెన్స్ పలు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కొందరైతే సమంత మరలా ప్రేమలో పడ్డారు అంటున్నారు. ప్రేమలో పడిన సమంత ఆ విషయాన్ని పరోక్షంగా ఇలా తెలియజేశారన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఓ సందర్భంలో సమంత ప్రేమపై తన అభిప్రాయం వెల్లడించారు. మరోసారి ప్రేమలో పడే ఆసక్తి తనకు లేదని కుండబద్దలు కొట్టింది.
మరి సమంత పోస్ట్ చేసిన ఆ కొటేషన్ అసలైన మీనింగ్ ఏమిటో? ఎవరిని ఉద్దేశించి చేశారో? తెలియాలంటే వేచి చూడాల్సిందే. పరిశ్రమకు వస్తూనే సమంత ప్రేమలో పడ్డారు. ఏమాయ చేశావే మూవీతో వెండితెరకు పరిచయమైన సమంత… నాగ చైతన్య ప్రేమలో పడ్డారు. 2010 లో మొదలైన సమంత-నాగ చైతన్య లవ్ ఎఫైర్ ఏళ్ల తరబడి నడిచింది. పెళ్ళికి కొన్ని నెలల ముందు మాత్రమే నాగ చైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారన్న వార్త బయటకు వచ్చింది.

2018 లో గోవాలో నాగ చైతన్యతో సమంత వివాహం జరిగింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట గత ఏడాది విడిపోయారు. 2021 అక్టోబర్ లో సమంత, చైతూ సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. సమంత, నాగ చైతన్య విడిపోయి ఏడాది గడుస్తుంది. అయితే సమంత మరొక వ్యక్తికి దగ్గరైన దాఖలాలు లేవు. అలాగే మరో పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి చూపలేదు.