Irumudi first look: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ‘మాస్ మహారాజా’ గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న ఆయన గత కొద్దిరోజుల నుంచి మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసినప్పటికి అవి ఏమాత్రం వర్కౌట్ కాలేదు… దాంతో తన పంథా ను మార్చుకొని ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి డిఫరెంట్ అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో శివా నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమాని చేస్తున్నాడు. గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో రవితేజ అయ్యప్ప మాల వేసుకుని కనిపిస్తున్నాడు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెలికెక్కుతుంది. ఇక తను అయ్యప్ప మాలలో ఇరుముడి కట్టుకొని ఒక అమ్మాయిని ఎత్తుకొని ఉన్నాడు. బహుశా ఆమె తన కూతురు అయి ఉంటుంది.
అంటే ఇది కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కుతుందా? తన కూతురికి ఏదైనా ఇబ్బంది ఉంటే రవితేజ దాన్ని సాల్వ్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా సస్పెన్స్ గొలిపే ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుందా? ఇక ఈ సినిమాలో దైవభక్తి కూడా ఉంటుంది దానిని డిఫరెంట్ ప్రజెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…ప్రస్తుతం ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా దర్శకుడు అయిన శివా నిర్వాణా సైతం గతంలో లవ్ స్టోరీస్ ని చాలా బాగా డీల్ చేశాడు. ఆయన చేసిన ప్రతి సినిమా అతనికి మంచి విజయాన్ని సాధించి పెట్టింది. ఇక ఇప్పుడు తన పంథా ను మార్చుకొని థ్రిల్లర్ సినిమాల వైపు ఎందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ జానర్ లో అతను సక్సెస్ ఫుల్ గా నిలబడగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…