Rajamouli Mahabharata pre production update: రాజమౌళి చేస్తున్న మహాభారతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందట. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించాలనే ఉద్దేశ్యంతో దీని మీద చాలావరకు కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ను సాధిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే పాన్ వరల్డ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేయాలని రాజమౌళి చూస్తుండటం విశేషం… ప్రస్తుతం హాలీవుడ్ దర్శకులతో పోటీపడుతూ ముందుకు దూసుకెళ్లడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాజమౌళి సినిమాలకు ఉన్న గుర్తింపు ఏ దర్శకుల సినిమాలకు రావడం లేదు. ఆయన సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సాటిస్ఫై అవుతాడు. ఎందుకంటే ఆయన చేసే సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు… ఇక ప్రస్తుతం ఆయన ఈ సినిమా తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘మహాభారతం’ సినిమాను చేస్తాడని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఇప్పుడప్పుడే రాజమౌళి ఆ సినిమాని చేయడంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికైతే రాజమౌళి మహాభారతం ఎప్పుడు చేసిన కూడా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం ఈ సినిమా లో ఇండియాలో ఉన్న హీరోలందరు నటించబోతున్నారు.
ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరితో పాటుగా హాలీవుడ్ నుంచి కూడా కొంతమంది హీరోలను ఇందులో భాగం చేయాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. ఇక ఈ సినిమా మీద దాదాపు 4000 నుంచి 5000 కోట్ల వరకు బడ్జెట్ నైతే పెట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయించాలంటే దాదాపు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కావాలి. ఒక్క ప్రొడ్యూసర్ అయితే అంత మొత్తంలో డబ్బులు ఉండకపోవచ్చు. అందుకే ఈ సినిమాకి ఇద్దరు ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరించే అవకాశమైతే ఉంది…