NTR-Prashant Neil : ప్రస్తుతం ఉన్న టాప్ స్టార్ హీరోలలో తదుపరి చిత్రాలపై ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి..ఒకప్పుడు ఏడాది కి రెండు సినిమాలు విడుదల చేసేవాడు..ఇప్పుడు అరవింద సామెత చిత్రం తర్వాత కేవలం #RRR సినిమా మినహా మరొకటి లేదు..సోలో హీరో గా ఎన్టీఆర్ నుండి ఒక సినిమా విడుదలై 5 ఏళ్ళు అయ్యింది..ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

#RRR సినిమా గ్రాండ్ హిట్ అయ్యి పాన్ వరల్డ్ రేంజ్ లో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఫ్యాన్స్ లో సంతోషం లేదు..#RRR చిత్రం తర్వాత కొరటాల శివతో ఒక సినిమా చెయ్యబోతున్నానని ప్రకటించాడు..కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు..ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది అంటూ ఇటీవలే అధికారిక ప్రకటన చేసారు.
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమా..’సలార్’ మూవీ ప్రారంభం కి ముందే ఈ చిత్రం కంఫర్మ్ అయ్యింది..కానీ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో..అసలు ఉంటుందో లేదో అనే భయం అభిమానులకు పట్టుకుంది..అందుకు కారణం కూడా లేకపోలేదు..ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమా తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభిస్తారు అని అభిమానులు ఆశించారు.
కానీ నిన్న దిల్ రాజు కాంబినేషన్ లో ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని..ఆ చిత్రం పేరు ‘రావణం’ అని ఒక న్యూస్ వచ్చింది..సలార్ తర్వాత ఈ సినిమా వెంటనే పట్టాలు ఎక్కబోతుందని కూడా న్యూస్ వచ్చింది..దీని తర్వాత KGF చాప్టర్ 3 ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు..మరి ఎన్టీఆర్ సినిమా సంగతి ఏమిటి అసలు ఉంటుందా లేదా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది..దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.