https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 లో భన్వర్ సింగ్ షేకవత్ మంగళం శ్రీను తో కలిపోయాడా.? మరి పుష్ప రాజ్ ప్లాన్ ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు వాళ్లలో అల్లు అర్జున్ ఒకరు. ఇక పుష్ప సినిమాతో 'నేషనల్ అవార్డు'ని సైతం సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ఇండియా మొత్తంలో భారీ అంచనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులైతే పుష్ప 2 సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్న విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 12:22 PM IST

    Pushpa 2(7)

    Follow us on

    Pushpa 2: ప్రస్తుతం ఇండియా మొత్తంలో ‘పుష్ప 2’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాకి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రావడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇక మొత్తానికైతే అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు కూడా భారీ ప్రణాళికలను రూపొందించి పకడ్బందీ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లైతే ఈ ట్రైలర్ లో చాలా కొత్త విషయాలు మనకు తెలియజేశారు. ముఖ్యంగా బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప మీద ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటారనే విషయం మీద ఎలాంటి క్లూ ఇవ్వకపోయిన కూడా ఆయన మంగళం శ్రీనుతో కలిసి పుష్ప మీద అటాక్ చేయబోతున్నాడనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరి మొత్తానికైతే ఈ సినిమాలో ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి పుష్పరాజ్ వీళ్ళందరి ఎలా ఎదుర్కోబోతున్నాడనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇందులో జగపతిబాబు క్యారెక్టర్ ని కూడా ఎక్స్ ట్రా గా ఆడ్ చేసిన విషయం మనకు తెలిసిందే. మరి ఆయన ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు. ఆయనకు పుష్పరాజ్ కి మధ్య ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలనే క్యూరియాసిటి ని ఈ ట్రైలర్ లో చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు.

    ఇక మొత్తానికైతే బన్వర్ సింగ్ షేకావత్, మంగళం శీను కలిసి పుష్పరాజుని భారీ దెబ్బ కొట్టబోతున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక తన భార్య కోసమే తను ఏదైనా చేస్తానని చెబుతూ ముందుకు సాగే పుష్పరాజ్ తన భార్యని ఎలా కోల్పోతాడు.

    మంగళం శ్రీను తో కలిసి తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయబోతున్నారు. అలాగే పుష్పరాజు మానసికంగా ఎలాంటి సిచువేషన్ ని ఎదుర్కోబోతున్నాడనేది కూడా ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ముఖ్యంగా ఈ సినిమాలో గంగాలమ్మ జాతర ఫైట్ అద్భుతంగా నిలవబోతుందని ఈ సినిమా మొత్తానికి ఇదే హైలెట్ కాబోతుందని సినిమా యూనిట్ చెప్పకనే చెబుతూ సినిమా ప్రమోషన్స్ ని భారీ రేంజ్ లో చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి డిసెంబర్ 5వ తేదీ వస్తేగానీ ఈ సినిమా ఎలాంటి ప్రబంధనాన్ని సృష్టిస్తుంది అనేది తెలియదు…