https://oktelugu.com/

NTR Dragon: ఎన్టీయార్ డ్రాగన్ సినిమాకి తప్పని క్యాస్టింగ్ కష్టాలు…

సినిమా అనేది ఇప్పుడు ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ సినిమా ఇండస్ట్రీ గా కొనసాగుతుంది. తద్వారా పాన్ ఇండియాలో ఎలాంటి కాన్సెప్ట్ లు వచ్చినా కూడా తెలుగు సినిమాలను మించి వసూళ్లను అయితే రాబట్టలేకపోవడం విశేషం. మరి మన హీరోలు సాధించిన ఘనత కూడా అలానే ఉండడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు దృష్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ పైనే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 12:25 PM IST

    NTR Dragon

    Follow us on

    NTR Dragon: తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు గారికి ఎనలేని గుర్తింపు అయితే ఉంటుంది. ఇక తెలుగు సినిమా స్టామినాని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతుంది. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇండియా లెవెల్లో చాటి చెప్పిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరుదైన గౌరవం అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం తకువ సమయం లోనే యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్లడానికి సర్వ సిద్ధం చేసుకుంటుంది. మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజిఎఫ్ సిరీస్ తో పాటు సాలార్ సినిమాలో కూడా తన దైన రీతిలో గుర్తింపుని సంపాదించుకున్నాడు. మరి ఈ సినిమాలు సాధించిన విజయాలను బట్టి ప్రశాంత్ నీల్ భారీ రేంజ్ లో డ్రాగన్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సరైన సక్సెస్ లేని జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో ఏకంగా 1500 కోట్లను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

    మరి మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే డ్రాగన్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళకముందే కొన్ని కష్టాలైతే ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ని ఎదుర్కొనే విలన్ పాత్రలో ఎవరిని తీసుకోవాలి అనేదానిమీద ప్రశాంత్ నీల్ ఒక రకమైన సందిగ్ధం లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

    అలాగే హీరోయిన్ గా కూడా ఎవరిని సెలెక్ట్ చేయాలి. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అందులో ఎవరెవరిని తీసుకోవాలి అనే దానిమీద ఆయన చాలావరకు కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తొందర్లోనే ఈ కన్ఫ్యూజన్స్ కి పులిస్టాప్ పెట్టి ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…