Raja Saab Movie Fake News: మన టాలీవుడ్ లో సినిమాలకు వచ్చే కలెక్షన్స్ ని నిర్మాతలు ఒక్కోసారి అభిమానుల కోసం వచ్చిన దానికంటే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ వాతావరణం తమ అభిమాన హీరో కి తక్కువ కలెక్షన్స్ వస్తే అభిమానులు అసలు తీసుకునే పరిస్థితిలో లేరు, అందుకే నిర్మాతలు సాధ్యమైనంత వారకు వాళ్ళను సంతోష పెట్టడానికే చూస్తారు. కానీ కొన్ని కొన్ని సార్లు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది ఫేక్ కలెక్షన్స్ ని చిన్న పిల్లవాడు కూడా కనిపెట్టగలరు. నిన్న విడుదలైన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రానికి ఇలాంటిదే ఒకటి జరిగింది. ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. చాలా ఆలస్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టినప్పటికీ , ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు.
కచ్చితంగా మంచి ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ షేర్ వసూళ్లు 17 కోట్ల రూపాయిలు వచ్చినట్టు సోషల్ మీడియా లోని ఒక పాపులర్ వెబ్ సైట్ ప్రచురించింది. దీన్ని చూసి నెటిజెన్స్ నివ్వెరపోయారు. వచ్చిన గ్రాస్ లో రెంట్స్, టాక్సులు, జీఎస్టీ తీసేసిన తర్వాత వచ్చేదే షేర్. రాజా సాబ్ చిత్రానికి 22 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది కాబట్టి , షేర్ వసూళ్లు 14 కోట్ల రూపాయిల రేంజ్ లో ఉంటుంది. అది కూడా రిటర్న్ జీఎస్టీ తో కలిపి. కానీ ఇక్కడ 17 కోట్ల రూపాయిలు అని అంటున్నారు. అంటే వచ్చిన గ్రాస్ లో 80 శాతం షేర్ అన్నమాట. టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఈ రేంజ్ ఫేక్ ఏ సినిమాకు కూడా జరగలేదని నెటిజెన్స్ ఆక్రోశం తో కామెంట్స్ చేస్తున్నారు. ఫేక్ కలెక్షన్స్ వాస్తవానికి దగ్గర గా ఉండేట్టు వేయాలి కానీ, అందరూ నవ్వుకునే రేంజ్ లో మాత్రం వేయకూడదని అంటున్నారు.
ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావడం ఒక అద్భుతం అనే చెప్పాలి. ప్రభాస్ నైజాం లో మొదటి నుండి మంచి స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి, ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి. ఆయన స్థానం లో మరో హీరో ఉండుంటే ఈ రేంజ్ గ్రాస్, షేర్ రావడం అసాధ్యం. వచ్చిన కలెక్షన్స్ ని ప్రచారం చేసుకొని ఉండుంటే చాలా హుందాగా ఉండేది. ఇప్పుడు 17 కోట్ల రూపాయిల షేర్ అనగానే, 14 కోట్ల రూపాయిల షేర్ కూడా ఫేక్ అయ్యుండొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రోజు వరకు బాగానే వచ్చింది, కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రం ఏ మేరకు గ్రాస్ వసూళ్లను రాబడుతుందో చూడాలి.