Kota Srinivasa Rao vs Pawan Kalyan : సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇటీవల పవన్ కళ్యాణ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ నేను రోజుకు రెండు కోట్లు సంపాదిస్తానని బహిరంగంగా ప్రకటించారు. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కామెంట్స్ ని కోటా తప్పుబట్టారు. విమర్శలు చేశాడు. కోటా కామెంట్స్ కి నిర్మాత నట్టి కుమార్ కౌంటర్ ఇచ్చారు. కోటాపై ఆయన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ నిజాయితీగా తాను తీసుకుంటున్నది చెప్పాడు. సంపాదిస్తున్న దానికి నిజాయితీగా టాక్స్ కడుతున్నాడు. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి చెబితే కోటా శ్రీనివాసరావుకు ఇబ్బంది ఏమిటీ?. నేను నిజాయితీగా బ్రతుకుతున్నాను. నాకు ఓటేయండి సేవ చేస్తాను అంటున్నారు. మిగతా వాళ్ళ లాగా ట్యాక్స్ ఎగ్గొట్టడం లేదు కదా. కోటా శ్రీనివాసరావుకు వయసు పెరిగింది. ఆయన గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది. కోటా మూడు నాలుగు షిఫ్ట్ లు పని చేసిన రోజులు ఉన్నాయి. డబ్బుల కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టారు. ఆయనకు మైక్ ఇస్తే నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు. ఇకనైనా ఆయన హద్దుల్లో ఉంటే బెటర్ అని ఘాటు కౌంటర్స్ ఇచ్చారు.
కోటా శ్రీనివాసరావు కామెంట్స్ ఈ మధ్య తరచుగా వివాదాస్పదం అవుతున్నాయి. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీద ఆయన విమర్శలు గుప్పించారు. నాగబాబు కోటా మీద ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడంతో అభిమానులు మండిపడుతున్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్స్ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్స్ తీసుకున్నారు. వారెప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు. ఈ మధ్య కొందరు హీరో రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నానని బహిరంగంగా చెబుతున్నారని కోటా ఎద్దేవా చేశారు.
ఇక కోటా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనకు ఆఫర్స్ తగ్గాయి. నేను నటించడానికి రెడీ అని చెప్పిన మేకర్స్ ఆసక్తి చూపడం లేదు. ఆ క్రమంలో తన అసహనాన్ని నేరుగానే కోటా బయటపెడుతున్నారు. ఇటీవల కోటా మరణించారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. నిజమే అని నమ్మిన పోలీసు బలగాలు ఆయన ఇంటికి చేరుకున్నాయి. తీరా కోటా ఎదురు రావడం చూసి వారు స్టన్ అయ్యారట. నేను బ్రతికే ఉన్నానంటూ కోటా ఓ వీడియో విడుదల చేశారు.