Homeఎంటర్టైన్మెంట్Miss Universe: మిస్ యూనివర్స్​గా హర్నాజ్​.. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాను వరించిన మకుటం

Miss Universe: మిస్ యూనివర్స్​గా హర్నాజ్​.. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాను వరించిన మకుటం

Miss Universe: 21 ఏళ్ల తర్వాత కృషి, పట్టుదలతో మిస్​ యూనివర్స్​గా మెరిసి.. దేశ ఖ్యాతిని పెంచిన వ్యక్తి హర్నాజ్ కౌర్ సంధు. 2000 సంవత్సరంలో లారా దత్త మన దేశం నుంచి మిస్ యూనివర్స్​గా నిలిచారు. మళ్లీ 2021లో ఇప్పుడు హర్నాజ్​ కౌర్​ సంధు ఈ ఘనత సాధించారు. సుమారు 80 దేశాల నుంచి వచ్చిన అప్సరసలతో పోటీ పి విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఇజ్రాయెల్​ వేదికగా మిస్​ యూనివర్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీకి ముందే హర్నాజ్​ మాట్లాడుతూ.. ఇండియాకు కిరీటం తీసుకొచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునన్నారు.

harnaaz-sandhu-21-crowned-miss-universe-2021-who-is-21-year-old-from-punjab

ఇక హర్నాజ్​ లైఫ్​ స్టోరీ విషయానికొస్తే.. ఛండీఘడ్​లో 200 సంవత్సరలం మార్చి 3న జన్మించింది. చిన్నప్పటి నుంచి మోడలింగ్, నటనపై ఆసక్తి ఉండటంతో.. ఈ అందాల పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. 15 ఏళ్లకే మిస్​ ఛండీఘడ్​గా గుర్తింపు సాధించి.. అక్కడే మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. నటనపై ఉన్న ఇష్టంతో చదువు కంటే కలలకు ప్రాధాన్యం ఇచ్చింది. పలు పంజాబీ సినిమాల్లో అవకాశం రావడంతో నటించింది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయాయి.

అయినా తన పట్టుదల విడువకుండా 2019లో ఫెమిని మిస్​ ఇండియా టైటిల్​తో పాటు.. 2021లో మిస్​ దివా 2021 అవార్డును కైవసం చేసుకుంది హర్నాజ్​. ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో కేవలం అందానికే కాదు, మంచి ఆలోచనకు, తెలివి తేటలకు కూడా మార్కులుంటాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular