Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇక్కడ మార్కెట్ అనేది పెరగాలంటే సక్సెస్ లు ఎక్కువగా రావాలి. అలా వచ్చినప్పుడే ఏ హీరోకి అయిన మార్కెట్ పెరుగుతుంది. దాని ద్వారా ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది. అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కీలకపాత్ర వహిస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక ఎప్పటినుంచో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న రవితేజ కూడా వరుసగా సినిమాలను చేస్తూ తను కూడా తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఆయనకు 2022 వ సంవత్సరంలో వచ్చిన ‘ ధమాకా’ సినిమా తర్వాత మరోక హిట్ అయితే రాలేదు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఆయన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ లాంటి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయినప్పటికీ ఈ మూడు సినిమాలు కూడా నిరాశ పరచడంతో మళ్లీ రవితేజ మార్కెట్ అయితే భారీగా డౌన్ అయింది.
ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కనక ఆయన సక్సెస్ సాధిస్తే తన పూర్వ వైభవం మళ్లీ తనకి తిరిగి వస్తుందని రవితేజ నమ్ముతున్నాడు. ఇక అందుకోసమే హరీష్ శంకర్ లాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తూ ఈ సినిమా సక్సెస్ ఒక్కటే తన టార్గెట్ గా పెట్టుకొని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే రవితేజ కెరీయర్ అనేది ఈ సినిమా మీదనే ఆధారపడి ఉందని చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కనక ఫ్లాప్ అయినట్టైతే రవితేజ మార్కెట్ మరింత డౌన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది…కాబట్టి ఈ సినిమాతో రవితేజ కెరియర్ కూడా డిసైడ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…