https://oktelugu.com/

Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని పక్కన పెట్టిన హరీష్ శంకర్.. కారణం ఏంటంటే..?

పవన్ కళ్యాణ్ చేసే సినిమాల కోసం ప్రతి ఒక్క వ్యక్తి ఎదురుచూస్తున్నాడు...ఇక ఇలాంటి క్రమం లో పవన్ కళ్యాణ్, సుజీత్ సినిమా కాంబో లో వస్తున్న ఓజీ సినిమా సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2023 / 06:40 PM IST

    Ustad Bhagath Singh, Harish Shankar

    Follow us on

    Ustad Bhagat Singh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో ఆయనకి ఉన్న ఫ్యాన్స్ మరే హీరోకి లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయన కి ఒక 10 సంవత్సరాల పాటు వరుసగా హిట్లు లేకపోయిన కూడా ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు అంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన రాజకీయాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరచకూడదనే ఒకే ఒక కారణం తో సమయం కుదిరినప్పుడు ఆయన అడపాదడప సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు 2024 సమ్మర్ లో ఏపీలో ఎలక్షన్స్ ఉండటం వల్ల ఆయన సినిమాల మీద ఫోకస్ పెట్టకుండా ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే ఆయన జనసేన పార్టీకి సంబంధించిన కార్యాచరణలో చాలా చురుగ్గా పాల్గొంటూ చాలా సభలను కూడా కండక్ట్ చేస్తూ వస్తున్నారు… ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది ఇక ఈ సినిమా సగానికంటే ఎక్కువగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది అయిన కూడా ఈ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద క్లారిటీ అయితే రాలేదు… దాంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ వల్ల ఈ సినిమా షూటింగ్ కి పవన్ కళ్యాణ్ దాదాపుగా 6 నెలల వరకు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో ఈ ఆరు నెలల గ్యాప్ లో హరీష్ శంకర్ మరో హీరోతో ఏదైనా సినిమా చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టి ఇంకో హీరో వేట లో పడ్డట్టుగా తెలుస్తుంది…

    అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సినిమాకి బ్రేక్ ఇచ్చి ఈ గ్యాప్ లో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.ఇక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో అంటే జనాలలో ఈ సినిమా మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దాని మీద క్లారిటీ లేకపోవడం తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకోసం ఎదురుచూడటం ఆపేశారు. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న నేపధ్యం లో ఈ సినిమా షూటింగ్ ను ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేసినట్టు గా ఈ రెండు మూడు రోజుల్లో సినిమా యూనిట్ అధికారికంగా తెలియజేయబోతుంది…

    ఇక ఇదే క్రమం లో పవన్ కళ్యాణ్ చేసే సినిమాల కోసం ప్రతి ఒక్క వ్యక్తి ఎదురుచూస్తున్నాడు…ఇక ఇలాంటి క్రమం లో పవన్ కళ్యాణ్, సుజీత్ సినిమా కాంబో లో వస్తున్న ఓజీ సినిమా సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది అన్నారు అది కూడా సంక్రాంతికి రావడం డౌట్ గానే కనిపిస్తుంది…చూడాలి మరి పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది…