HHVM Advanced Tickets Sale: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు ట్రేడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆరేళ్ళ నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నో సమస్యలు,మరెన్నో అడ్డంకులు, లెక్కలేనంత నెగటివ్ పబ్లిసిటీ, ఇన్ని కష్టాల మధ్య ఈ సినిమా విడుదల అవుతుంది. ఎన్ని కష్టాలొచ్చినా,పవన్ కళ్యాణ్ స్టామినా ఈ సినిమాని కాపాడుతుంది అనే బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు. అయితే నిరాశతో ఉన్న అభిమానుల్లో సరికొత్త నూతనోత్సాహం నింపిన వార్త, ఈ సినిమాకు విడుదలకు ముందే పైడ్ ప్రీమియర్ షోస్ ఉంటాయని నిర్మాత ఖరారు చేయడం, సాయంత్రానికి అందుకు సంబందించిన జీవో రావడం తో అభిమానుల్లో ఉత్సాహం మామూలు రేంజ్ లో రాలేదు. దానికి తగ్గట్టుగా నిన్న రాత్రి కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.
విజయవాడ లో 8 గంటల ఆటలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని అలంకార్ మరియు జయరాం థియేటర్స్ లో మొదలు పెట్టారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ రెండు థియేటర్స్ లో టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి. అదే విధంగా డిస్ట్రిక్ట్ యాప్ లో క్యాపిటల్ సినిమాస్ లో రెండవ రోజు నుండి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే రెండవ రోజు బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే నిమిషాల వ్యవధిలో టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్ లోనే పెడతారట. ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేట లో ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టేశారు.
ట్రెండ్ ఇప్పుడే ఎలా ఉందో చెప్పలేము. కేవలం ఒకటి రెండు థియేటర్స్ తో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి జీవో వచ్చేసింది కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. పైడ్ ప్రీమియర్ షోస్ కంటే ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ షోస్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. c సెంటర్స్ లో బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగవు కాబట్టి, ఆ సెంటర్స్ లో ఈరోజే బుకింగ్స్ ని మొదలు పెట్టడం శ్రేయస్కరం. చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. ఈ ప్రీమియర్ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఓపెనింగ్ వసూళ్లు ఉంటాయి. కానీ నెగటివ్ టాక్ వస్తే మాత్రం ఓపెనింగ్స్ పై చాలా బలమైన ప్రభావం పడుద్ది.