Hari Hara Veera Mallu Tickets: మరో నాలుగు రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఎన్నో కష్టాలు, అడ్డంకులను ఎదురుకొని ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత AM రత్నం. ఈ క్రమం లో ఈ చిత్రం గురించి జరిగిన నెగటివ్ ప్రచారాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ అవ్వడం వల్ల సినిమా షూటింగ్ చాలా రోజుల వరకు ఆగిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని పూర్తిగా ఆపేశారని, పవన్ కళ్యాణ్ వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిపోయాడని ఒక ప్రచారం చేశారు. కానీ అవన్నీ రూమర్స్ అని మీడియా కి క్లారిటీ ఇచ్చి, పవన్ కళ్యాణ్ కి సమయం దొరికినప్పుడు షూటింగ్ చేసుకుంటూ వచ్చాడు. బడ్జెట్ అనుకున్న దానికంటే మూడింతలు ఎక్కువ అయ్యింది.
జరిగిన బడ్జెట్ కి తగ్గట్టు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చెయ్యాలని అనుకున్నాడు నిర్మాత AM రత్నం. కానీ మన అందరికీ తెలిసిందే, మార్కెట్ లో పాతబడిన ఏ ప్రోడక్ట్ కి అయినా డిమాండ్ ఉండదు. అదే విధంగా ఈ సినిమాకు కూడా డిమాండ్ లేదు. ఎందుకంటే రెండు నెలల్లో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఓజీ’ చిత్రం విడుదల కాబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన బిజినెస్ అన్ని ప్రాంతాల్లో ముగిసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఓజీ పై మోజుతో హరి హర వీరమల్లు ని పట్టించుకోలేదు. ట్రైలర్ తో కాస్త బజ్ వచ్చింది కానీ, సోషల్ మీడియా లో పదే పదే ఈ సినిమాకు బయ్యర్స్ లేరంటూ ప్రచారం చేయడం వల్ల అభిమానుల్లో ఉత్సహం సన్నగిల్లింది. అయితే ఎట్టకేలకు వాటిని అన్నిటిని ఎదురుకొని ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్స్ ని పెంచుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో ని జారీ చేసింది.
ఈ జీవో పట్ల అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే టికెట్స్ రేట్స్ పెంచితే వాటిని వ్యతిరేకించేవాళ్ళు కూడా ఉంటారు కదా. దీనిపై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ ప్రస్తావించగా, AM రత్నం ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘తెలుగు సినిమా ఇండస్ట్రీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది. ఇలాంటి సమయంలో ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమాలకు టికెట్ రేట్స్ తగ్గించమని అడగడం కరెక్ట్ కాదు. సినిమా అనేది నిత్యావసర సరుకు కాదు , ఇష్టం ఉన్నోళ్లు చూస్తారు,లేదంటే లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు AM రత్నం. ఆయన మాట్లాడిన ఈ మాటలు బాగా వైరల్ అయ్యాయి.