Hari Hara Veeramallu OTT Streaming Date : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ప్రస్తుతం ఆయన హీరోగా చేసిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా ఈనెల 12వ తేదీన థియేటర్లోకి వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేపడుతున్న సినిమా యూనిట్ మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదట ఈ సినిమాకి క్రిష్ దర్శకుడుగా వ్యవహరించినప్పటికి సినిమా రోజురోజుకి లేట్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక ప్రొడ్యూసర్ ఏ ఏం రత్నం (A M Rathnam) కొడుకు అయిన జ్యోతి కృష్ణ (Jyothi Krishna) ఈ సినిమాకి దర్శకుడిగా మారి బ్యాలెన్స్ షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది సగటు ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది.
ఇకమీదట పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాలను మాత్రం పూర్తి చేయాలని ఆయన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఓజి (OG) సినిమాని సైతం శరవేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడు.
ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు… ఇక హరిహర వీరమల్లు సినిమా ఇంకా థియేటర్లోకి రాలేదు అప్పుడే ఓటిటి డేట్ ని కూడా అనౌన్స్ చేశారు అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా రైట్స్ ని భారీ రేంజ్ లో డబ్బులు ఇచ్చి కొనుక్కున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా జూన్ 12 న రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఆగస్టు మొదటి వారంలో గాని లేదంటే రెండో వారంలో గాని ఈ సినిమాని ఓటిటి లో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చే ఆలోచనలో అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఉన్నారట. సినిమా యూనిట్ కి కూడా ఈ డేట్ ని చెప్పినట్టుగా తెలుస్తోంది. వాళ్లు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారట… చూడాలి మరి హరిహర వీరమల్లు ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ మేనియా మరోసారి వర్కౌట్ అవుతుందా లేదా అనేది…