Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు పవన్ కళ్యాణ్ పై, హరి హర వీరమల్లు టీం పై తీవ్రమైన ఆగ్రహం తో ఉన్నారు. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ని అభిమానులు ట్యాగ్ చేసి తిట్టని రోజంటూ లేదు. ఎందుకంటే ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి ఆయన కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే చాలు, సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. కానీ ఆ నాలుగు రోజుల డేట్స్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ నిర్మాత ఏం రత్నం ని పెడుతున్న హింస అంతా ఇంతా కాదు. ఒకపక్క అమెజాన్ ప్రైమ్ సంస్థ కు ఈ సినిమాని అమ్మి చాలా రోజులైంది. వాళ్ళు విడుదల తేదీ విషయం లో క్లారిటీ లేకపోతే, డీల్ ని క్యాన్సిల్ చేసుకుంటారు. ఇప్పటికి 11 సార్లు ఈ సినిమాని వాయిదా వేశారు. కొంతమంది పవన్ అభిమానులు అయితే ఈ సినిమాని పట్టించుకోవడం కూడా మానేశారు.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!
ఎన్నో వాయిదాల తర్వాత ఈ చిత్రాన్ని మే9న విడుదల చేయబోతున్నామని అధికారికంగా గత నెలలో ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఆ తేదీన విడుదల అవ్వడం లేదని స్పష్టంగా అందరికీ అర్థం అయ్యింది. విడుదల తేదీని ప్రకటించి, వాయిదా పడినప్పుడు, కొన్ని అనివార్య కారణాల వల్ల చెప్పిన తేదికి ఈ సినిమాని విడుదల చేయలేకపోయాము, మీ అందరికీ అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని కలిగించడమే మా లక్ష్యం, అందుకు కాస్త సమయం పడుతుంది, అభిమానులు ఓపికగా ఎదురు చూడాలి అంటూ వాయిదా పడిన సమయం లో ఇతర హీరోల సినిమాలకు సంబంధించిన మేకర్స్ ఒక ప్రకటన చేస్తుంటారు. కానీ ఈ సినిమాకు అలాంటిదేమి లేదు. అభిమానులే కదా సచ్చినట్టు ఎదురు చూస్తారులే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. వాయిదా పడిన విషయాన్ని కూడా చెప్పడం లేదు. కొత్త విడుదల తేదీతో మళ్ళీ వస్తారు,ఆ తేదీన కూడా ఈ చిత్రం రాదని తెలుసు, అయినా కూడా ఓటీటీ డీల్ క్యాన్సిల్ అవ్వకూడదని ఎదో ఒక విడుదల తేదీని ప్రకటిస్తారు.
ఇదంతా పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ వల్లే అని అభిమానులు మండిపడుతున్నారు. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా ని కలవడానికి రెండు వారాల పాటు తన అధికార కార్యక్రమాలకు డుమ్మా కొట్టి సింగపూర్ కి వెళ్ళాడు. రీసెంట్ గా తన కొడుకు అగ్ని ప్రమాదానికి గురి అయితే, అధికార కార్యక్రమాలకు సెలవు పెట్టి సింగపూర్ కి వెళ్లి వారం తర్వాత తిరిగి వచ్చాడు. అదే విధంగా యుద్ధ ప్రాతిపదికన ‘హరి హర వీరమల్లు’ సినిమాని కూడా పూర్తి చెయ్యొచ్చు కదా?, నాలుగు రోజులు సెలవు పెట్టాను అనుకొని ఆ చిత్రాన్ని పూర్తి చేస్తే నీ సొమ్ము ఏమి అరిగిపోతాది, అభిమానులను నిర్మాతను బయ్యర్స్ ని ఇంత టార్చర్ పెట్టడం ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్న అర్థానాథాలు మామూలుగా లేవు.