Hari Hara Veeramallu Trailer Update: ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సరికొత్త విడుదల తేదీ ని రేపు ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో విడుదల తేదీలు వచ్చాయి, ఎన్నోసార్లు వాయిదాలు పడింది, అభిమానులకు కూడా ఇదంతా చూసి అలవాటైపోయింది, కొంతమందికి విసుగొచ్చి సోషల్ మీడియా ని చూడడమే మానేశారు. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే ఈ చిత్రం మూడు సార్లు వాయిదా పడింది. ముందుగా మార్చ్ 28 న విడుదల చేస్తామని చెప్పారు, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వాళ్ళ మే 28 కి వాయిదా పడింది. పోనీ అప్పటికైనా ఈ సినిమా వస్తుందిలే అనుకుంటే అప్పటికీ కూడా రాలేదు, జూన్ 12 కి వాయిదా వేశారు. జూన్ 12 న కచ్చితంగా వస్తుందని అనుకున్నారు. ఆ మేరకు ప్రొమోషన్స్ పెట్టారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సహా అన్ని ఫిక్స్ చేసుకున్నారు.
ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అంతా ఓకే అని అనుకుంటున్న సమయం లో ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. కారణం VFX వర్క్ ఇంకా పూర్తి అవ్వకపోవడమే. ఇప్పటికీ కూడా VFX వర్క్ పూర్తి అవ్వలేదు. ఈ సినిమాకి సంబంధించిన VFX వర్క్ మొత్తం ఇరాన్ లోని ఒక ప్రముఖ కంపెనీ లో జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ దేశ పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాలుగు రోజుల నుండి ఇజ్రాయిల్ తో భీకర యుద్దాన్ని ఎదురుకుంటూ ఉంది. VFX వర్క్ మొత్తం ఎప్పటికి డెలివరీ అవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ సినిమా విడుదల తేదీని రేపు మరో సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్ జులై మొదటి వారం లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ వారం లో ట్రైలర్ వచ్చేస్తుందని ఆశించారు.
కానీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో జులై మొదటి వారానికి వాయిదా వేశారు. ఇక సినిమాని జులై 24 న విడుదల చేయడానికి ఖరారు చేశారట. నిర్మాతలు జులై 18 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చాలా వరకు ప్రయత్నం చేశారు కానీ, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ససేమీరా ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో జులై 24 న విడుదల చేయాల్సి వస్తుంది. ఈ సినిమా విడుదలైన ఒక్క రోజు తర్వాత విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడేందుకు ఆ చిత్ర నిర్మాత నాగవంశీ కి ఇష్టం లేదు, కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ చెప్పిన డేట్ కి రావాల్సిందే అని పట్టుబడడంతో జులై 25 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విడుదల తేదీ ప్రకటనకు సంబంధించిన వీడియో ని సిద్ధం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Release date official announcement tomorrow. Trailer out on July 1st week. #HHVM#HariHaraVeeraMallu
— ustad (@ustadkalyan) June 18, 2025