Hari Hara Veeramallu : మరో మూడు రోజుల్లో ఆరేళ్ళ నుండి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. నేడు ఉదయం పవన్ కళ్యాణ్ మూవీ టీం తో కలిసి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. మరి కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కడలేని నూతనోత్సాహాన్ని నింపిన అంశం విడుదలకు ముందు రోజే పైడ్ ప్రీమియర్ షోస్ ఉంటాయనే వార్త రావడం. ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా మొదలు పెట్టేశారు. ఈ ప్రీమియర్ షోస్ కి సంబంధించిన టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ లో కూడా ప్రీమియర్ షోస్ ఉంటాయని అభిమానులు ఆశించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అందుకు కారణం హై కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ అని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే , గత ఏడాది డిసెంబర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ప్రీమియర్ షోస్ సమయం లో సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటనే. అప్పటి నుండి కోర్టు తెలంగాణ ప్రాంతం లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 8 గంటల లోపు షోస్ ప్రదర్శించరాదని, ప్రభుత్వం కూడా అందుకు అనుమతి ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. అందుకే పైడ్ ప్రీమియర్ షోస్ తెలంగాణ లో ఉండవని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది మరి కాసేపట్లో తేలనుంది. ఈరోజు రాత్రి, లేదా రేపు ఉదయం ఈ సినిమాకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే కోర్టు రాత్రి 11 గంటల నుండి ఉదయం 8 గంటల మధ్య షోస్ ని ప్రదర్శించవద్దు అని ఆదేశాలు ఇచ్చింది కానీ, 9 గంటల షోని ఆపమని ఆదేశాలు ఇవ్వలేదు కదా?, కాబట్టి 23 వ తేదీ రాత్రి తెలంగాణ వ్యాప్తంగా 9 గంటలకు ప్రీమియర్ షోస్ ని ప్రదర్శించమని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మూవీ టీం కూడా ఈ అంశం పై ప్రభుత్వం తో చర్చలు జరుపుతుంది. మరి ఈ చర్చలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. ఒకవేళ ఫలిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకోవచ్చు, లేదంటే ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లి ప్రీమియర్ షోస్ ని చూసుకోవాల్సి వస్తుంది.