Hari Hara Veeramallu : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానులను, ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చిన చిత్రాల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాక విడుదలైన మొట్టమొదటి చిత్రమిది. అభిమానుల్లో ఈ చిత్రం పై ఎలాంటి ఆశలు ఉండుంటాయో ఊహించుకోవచ్చు. చాలా కాలం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా అవ్వడం తో ఫ్యాన్స్ ప్రీమియర్ షోస్ టికెట్స్ ని 700 పెట్టి వెళ్ళడానికి కూడా వెనకాడాలేదు. కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రం 17 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ఎంతో నెగిటివిటీ ని ఎదురుకున్నప్పటికీ కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిది అనేది.
అలా ఎంతో ఆశతో థియేటర్ లోకి అడుగుపెట్టిన ఫ్యాన్స్ ని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తన అద్భుతమైన దర్శకత్వం తో, భీభత్సమైన గ్రాఫిక్స్ వర్క్ తో థియేటర్స్ కి వచ్చిన ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని భయపెట్టి పంపాడు. దీంతో సాధారణ ఆడియన్స్ కూడా ఆ అద్భుతమైన గ్రాఫిక్స్ ని థియేటర్ లో చూసేందుకు ఇష్టపడలేదు. ఫలితంగా ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. మొదటి రోజే 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా, క్లోజింగ్ లో 75 కోట్ల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఘోరమైన అవమానం లాంటిది అనొచ్చు. ఇది కాసేపు పక్కన పెడితే ప్రీ రిలీజ్ బిజినెస్ సమయం లో కొన్ని బిజినెస్ టర్మ్స్ ఉంటాయి. బయ్యర్స్ ఒక సినిమాని కొనుగోలు చెయ్యాలంటే కచ్చితంగా GST తో కలిపి కొనుగోలు చెయ్యాలి. ఈ సినిమాకి కూడా అదే చేశారు.
కానీ సినిమా విడుదల తర్వాత ఆ బయ్యర్స్ కి నిర్మాత రిటర్న్ GST ఇవ్వాల్సి ఉంటుంది. అంటే థియేట్రికల్ నుండి ఎంత షేర్ వసూళ్లు అయితే వస్తాయో, అందులో కొంత శాతం GST రూపం లో నిర్మాత బయ్యర్స్ కి చెల్లించాలి. అది ఇప్పటి వరకు నిర్మాత AM రత్నం ఎవరికీ చెల్లించలేదు. దీంతో బయ్యర్స్ ఇప్పుడు నిర్మాత AM రత్నం ఇంటికి వెళ్లి రిటర్న్ GST డబ్బులు అడగడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. రేపు, లేదా ఎల్లుండి ఆయన ఇంటికి వెళ్లే అవకాశం ఉందని, నిర్మాత రత్నం అనుకూలంగా రెస్పాన్స్ ఇస్తే ఓకే, లేదంటే మాత్రం బయ్యర్లు ఆయన ఇంటి ముందే కూర్చొని ధర్నాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాబోయే రోజుల్లో ఇది పెద్ద సమస్య గా మారే అవకాశం ఉంది.