Bigg Boss 9 Telugu : ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) పై ప్రేక్షకుల్లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సీజన్ లోకి సామాన్యులను కంటెస్టెంట్స్ గా తీసుకుంటున్నారు. అది కూడా సరికొత్త పద్దతిలో, అగ్నిపరీక్ష అనే కాంటెస్ట్ ద్వారా తీసుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా సుమారుగా బిగ్ బాస్ టీం కి 18 వేల అప్లికేషన్స్ వచ్చాయట. వాటి నుండి కేవలం 200 అప్లికేషన్స్ ని తీసుకొని, ఆ సామాన్యులకు ఇంటర్వ్యూస్ ని నిర్వహించి కేవలం 42 మందిని అగ్నిపరీక్ష కాంటెస్ట్ కి ఎంచుకున్నారు. ఈ 42 మందిలో కూడా వివిధ రకాల టాస్కులను పెట్టి కేవలం 15 మందిని ఎంచుకున్నారట. ఈ 15 మందిని మూడు గ్రూప్స్ గా విభజించి వాటికి న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి అభిజిత్(Abhijit), బిందు మాధవి(Bindu Madhavi) మరియు నవదీప్(Navdeep) లను లీడర్స్ గా ఉంచారట.
గత నాలుగు రోజుల నుండి ఈ అగ్నిపరీక్ష షూటింగ్ విరామం లేకుండా సాగుతుంది. ఈ నెల 22 వ తేదీ నుండి మనం జియో హాట్ స్టార్ లో వీటికి సంబంధించిన ఎపిసోడ్స్ ని చూడొచ్చు. అయితే అగ్నిపరీక్ష కాంటెస్ట్ సాధారణంగా అయితే జరగడం లేదట. చాలా ఫైర్ మీద జరుగుతున్నట్టు తెలుస్తుంది. అభిజిత్ మొదటి రోజే కొంతమంది కంటెస్టెంట్స్ పై ఫైర్ అవుతూ, పెద్ద క్లాస్ పీకాడట, ఆయన ఫైర్ ని చూసి అక్కడ ఉన్నోళ్లంతా భయపడినట్టు సమాచారం. ఎంతో కూల్ యాటిట్యూడ్ తో ఉండే అభిజిత్ లో అంతటి ఫైర్ ని రేపిన ఆ కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే 22వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇది కాసేపు పక్కన పెడితే రీసెంట్ గానే ఈ అగ్నిపరీక్ష కాంటెస్ట్ కి సంబంధించిన షూటింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఈ వీడియో లో నవదీప్, అభిజిత్, బిందు మాధవి కూర్చొని ఉంటారు.
ఎవరో కంటెస్టెంట్ తో బిందు మాధవి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అని అనడం, నవదీప్ అదే కంటెస్టెంట్ పై అరిచి వాకౌట్ చేయడం వంటివి హాట్ టాపిక్ గా మారింది. ఇది కాసేపు పక్కన పెడితే నిన్న జరిగిన షూటింగ్ లో అభిజిత్ కి, ఒక కంటెస్టెంట్ కి మధ్య చిన్న వాగ్వాదం జరిగిందట. ఈ వాగ్వాదం లో కంటెస్టెంట్ అదుపు తప్పి అభిజిత్ ని స్టుపిడ్ అని తిట్టిందట. ఆ తర్వాత అభిజిత్ కూడా చాలా ఫైర్ అయ్యాడని, నిన్న షూటింగ్ మొత్తం రసాభాస గా జరిగిందని అంటున్నారు. ఈ కాంటెస్ట్ లో పాల్గొని బయటకి వచ్చిన వాళ్ళు కూడా అభిజిత్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. అంతలా అభిజిత్ ఏమి చేస్తున్నాడు?, తప్పు ఆయనదా? లేదా ఆయన తో గొడవ పడిన కంటెస్టెంట్స్ దా అనేది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.