Pawan Kalyan Brahmanandam moment: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం(Bramhanandam) బంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విధంగా బ్రహ్మానందం ఇండస్ట్రీ లోకి రావడానికి మెగాస్టార్ చిరంజీవి నే ముఖ్య కారణం. ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో స్వయంగా చెప్పుకున్నాడు. చిరంజీవి కి కూడా బ్రహ్మానందం అంటే ఎంతో అభిమానం, ప్రేమ. రక్తం పంచుకొని పుట్టకపోయిన బ్రహ్మానందం చిరంజీవి కుటుంబం లో ఒక భాగమే అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిరంజీవి తో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు కానీ, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో కూడా అంతే మంచి సాన్నిహిత్యం ఉంది అనే విషయం మాత్రం నిన్న జరిగిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం స్పీచ్ చూసిన తర్వాత అందరికి అర్థం అయ్యింది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ భార్య రావడానికి కారణం ఇదా?
ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. ఎంత గొప్పవాడంటే, చాలా గొప్పవాడు అని మాత్రమే చెప్పగలను. చిన్నప్పటి నుండి నేను ఆయన్ని చూస్తూనే ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదో ఎదో చెయ్యాలి అనే తపన లో ఆయనలో ఉండేది. సమాజానికి ఎదో ఒక ఉపయోగపడే పని చెయ్యాలి అని నాతో అంటుండేవాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదురు లేకుండా, తాను వేసుకున్న బాటలో నడుచుకుంటూ వేళ్ళాడే తప్ప, ఎవ్వరో వేసిన బాటలో ఆయన ఎప్పుడు నడవలేదు. తన బాటలో వస్తున్నా ముళ్ళు, కష్టాలు, అవాంతరాలు తన అంతట తానే ఎదురు తిరిగి, రొమ్ము విరుచుకొని ముందుకు వేళ్ళాడే తప్ప, ఎవరో వేసిన బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో పది మందిని నడిచేలా చేసిన వ్యక్తి. తనని తాను సొంతంగా చిక్కుకున్న శిల్పి’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: AM రత్నంని వాళ్లిద్దరూ అంత టార్చర్ పెట్టారా..? అందుకే నేడు పవన్ ప్రెస్ మీట్?
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఒక లక్ష్యం పెట్టుకొని ఎదిగిన వ్యక్తి కాదు, విధి చూపించిన దారిలో నడుస్తూ ఈ స్థాయికి ఎదిగిన మహా మనిషి. నటుడు అవ్వాలని ఆయన కోరుకోలేదు, కానీ నటుడు అయ్యాడు. రాజకీయాల్లోకి కూడా అంతే, ఏది కూడా ప్లాన్ చేసుకొని రాలేదు. ఆయన తో నాకు ఉన్న అనుభందం సాధారణమైనది కాదు. మాటల్లో వర్ణించలేనిది. ఎప్పటికైనా మీ ఒడిలో తలవాల్చుకొని వెక్కి వెక్కి ఏడవాలని నా కోరిక’ అంటూ బ్రహ్మానందం మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో మీరే ఈ క్రింది వీడియో లో చూడండి. పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం మాట్లాడుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే బండ్ల గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లేని లోటు బ్రహ్మానందం పూడ్చినట్టు అయ్యింది.