Hari Hara Veera Mallu vs Kingdom: షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 12కు విడుదలకు సిద్దమైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం చివరి నిమిషం లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడిన క్షణం నుండి ఇప్పటి వరకు మేకర్స్ కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టి వాయిదా పడింది అని చెప్పలేదు. మీడియా కి చిన్న ప్రెస్ నోట్ ని వదిలారంతే. అది కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. దీంతో అత్యధిక శాతం మంది అభిమానులు ఈ సినిమా జూన్ 12నే విడుదల అవుతుందని అనుకున్నారు. అనేక చోట్ల థియేటర్స్ బయట అభిమానులు బ్యానర్లు, కటౌట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. చివరికి వాయిదా పడింది అని తెలుసుకొని బాధ పడ్డారు. కొత్త విడుదల తేదీ పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ తో గత రెండు రోజులుగా విడుదల తేదీ విషయం లో చర్చలు జరుగుతున్నాయి.
నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని జులై 18 న విడుదల చేయాలని అనుకుంటున్నాడు. కానీ అమెజాన్ ప్రైమ్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని జులై 25 నే విడుదల చేయాలని పట్టుబడుతోంది, లేకపోతే పది నుండి 20 కోట్ల రూపాయిల వరకు కట్ చేస్తామని హెచ్చరించారట. మరోపక్క విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రానికి కూడా నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ మరో అవకాశం ఇవ్వడం లేదు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం జులై 25 న విడుదల అవుతుంది కాబట్టి, ‘కింగ్డమ్’ చిత్రాన్ని ఆగష్టు 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ కి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒప్పుకోవడం లేదు. జులై 25 నే రావాలని చెప్తున్నారట. దీంతో ఈ రెండు సినిమాలకు ప్రస్తుతానికి అయితే ఒకే రోజున విడుదలై క్లాష్ ని ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘హరి హర వీరమల్లు’ చిత్రానికి పెట్టిన ఖర్చుకు, జరిగిన బిజినెస్ కి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రెండు వారాల ఫ్రీ గ్రౌండ్ కావాలి. కానీ ఇక్కడ టైట్ గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి నిర్మాత రత్నం ఏమి చేయబోతున్నాడు?, అమెజాన్ ప్రైమ్ చెప్పినట్లుగా జులై 25 న ఈ చిత్రం వస్తుందా?, లేకపోతే జులై 18 న విడుదలై 10 నుండి 20 కోట్ల రూపాయిలు బొక్క పెట్టుకోబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటన కోసం అభిమానులు మాత్రమే కాదు, ట్రేడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ సినిమా తేదీని ప్రకటిస్తేనే మిగిలిన తేదీలకు సంబంధించిన సినిమాలు వస్తాయి. లేదంటే అన్నీ చిత్రాలు రిస్క్ లో పడినట్టే. ఈ వారం లోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.