HHVM Box Office Collections: అసలే ఆరేళ్ళ నుండి ఆలస్యం అవుతూ వచ్చి అవుట్ డేటెడ్ సినిమా అని అనిపించుకున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) కి, కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలి, లేకుంటే ఘోరమైన డిజాస్టర్ చూస్తాము, కనికరించు దేవుడా అని దేవుడ్ని కోరుకొని పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమాని ఉండదు. కానీ ప్రీమియర్ షోస్ కి 700 రూపాయిలు టికెట్ కొనుక్కొని వెళ్లి మరీ చూసిన అభిమానులే ఈ చిత్రానికి ఘోరమైన డిజాస్టర్ టాక్ ని చెప్పారు. దీంతో మొదటి రోజే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా, 70 కోట్ల గ్రాస్ వద్దనే ఆగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుండి 60 కోట్ల రూపాయిల షేర్ ని మొదటి రోజే రాబట్టాల్సిన ఈ సినిమా, కేవలం 40 కోట్ల రూపాయలతో సరిపెట్టాల్సి వచ్చింది. ఇక రెండవ రోజు పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
Also Read: మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ ఒక్కటి మిస్ అవ్వబోతుందా..?
8 ఏళ్ళ క్రితం వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం కంటే తక్కువ వసూళ్లను రాబట్టింది. దీంతో అందరూ ఈ సినిమా పని అయిపోయింది, అభిమానులు కలలో కూడా ఊహించని ఘోరమైన డిజాస్టర్ వసూళ్లను ఈ సినిమాకు చూడబోతున్నారు అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ మూడవ రోజు సెకండ్ షోస్ అన్ని సెంటర్స్ లోనూ దంచి కొట్టేసింది. దీంతో మూడవ రోజు కాస్త రెండవ రోజు తో పోలిస్తే డీసెంట్ వసూళ్లను నమోదు చేసుకున్నాయి. కానీ నాల్గవ రోజు మాత్రం మార్నింగ్ షోస్ నుండే ఈ చిత్రం విశ్వరూపం చూపించేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి భారీ లెవెల్ లో క్యూలు కట్టడం తో అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్లు భారీగా నమోదు అయ్యాయి. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో మూడవ రోజు 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. కానీ నిన్న, అనగా నాల్గవ రోజు ఏకంగా 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
Also Read: ‘హరిహర వీరమల్లు’ మూవీ స్టోరీని మార్చమని పవన్ కళ్యాణ్ చెప్పారా..?
అదే విధంగా సీడెడ్, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. దీంతో నాల్గవ రోజు ఈ చిత్రానికి దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు మూడు కోట్ల రూపాయిల షేర్ కి పడిపోయిన ఈ సినిమా, నాల్గవ రోజు 8 కోట్ల రూపాయిల వరకు ఎగబాకింది అంటే, కచ్చితంగా ఈ సినిమా లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే చిన్నపాటి అవకాశాలు ఉన్నాయి. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఓవరాల్ గా ఈ చిత్రం నాలుగు రోజుల్లో 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు రావాల్సిన వసూళ్లు నాలుగు రోజులకు కలిపి వచ్చింది.