Hari Hara Veera Mallu Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి సినిమాలను మాత్రం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాతో ఈ నెల 24వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఈ సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ఎట్టకేలకు ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన సందర్భంలో ఈ సినిమా ఎలా ఉండబోతోంది సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి…ఇక దాంతో పాటుగా మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది అనేది కూడా తెలియాల్సి ఉంది. దాదాపు ఈ సినిమా కోసం 2000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. మరి 1200 కోట్ల బడ్జెట్ కు మించి ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
Also Read: వృత్తినే ఇంటిపేరుగా మార్చుకున్నాడు.. ఫిష్ వెంకట్ మృతికి కారణమిదే…
అయితే పవన్ కళ్యాణ్ లాంటి నటుడు బాలీవుడ్ జనులకు పెద్దగా పరిచయం అయితే లేదు. సినిమాలపరంగా ఆయన బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనప్పటికీ, పొలిటిషన్ గా మాత్రం బాలీవుడ్ లో కూడా ఆయనకు చాలా మంచి క్రేజ్ అయితే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోల రేంజ్ లో పవన్ కళ్యాణ్ సైతం తన స్టామినా చూపించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను అయితే కొల్లగొడుతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా మీద మొదట్లో మంచి బజ్ ఉన్నప్పటికి అంత పెద్ద బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు…
మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ తన స్టామినాని చూపించే సినిమా ఇది అవుతుంది అని అతని అభిమానులు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి హీరోలందరికీ పోటీని ఇస్తూ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో స్టార్ స్టేటస్ ని అందుకుంటాడా లేదా అనేది…