టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను బాలీవుడ్ లో గుడ్ కాన్సెప్ట్ లతో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ క్రమంలో తెలుగులో చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ పోగొట్టడానికి తాజాగా ఈ అమ‍్మడు చేస్తోన్న తెలుగు సినిమా`మిషన్ ఇంపాజిబుల్`. కాగా ఈ సినిమాలో ప్రముఖ స్టార్స్ అందరూ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లో మలయాళ నటుడు హరీశ్ పేరడీ కూడా చేరాడు.
మలయాళ చిత్రసీమలో హరీశ్ పేరడీకి ఒక గుర్తింపు ఉంది. తన నటనతో పాత్రకు జీవం పోయడమే కాదు, కళ్లతోనే విలనిజాన్ని చూపిస్తూ ఆ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చే గొప్ప నటుడు హరీశ్ పేరడీ. తంబి, మెర్సల్, ఖైది, స్పైడర్, రాక్షసి, పులి మురుగన్, భూమియిలే, మనోహర, స్వకార్యం వంటి సినిమాల్లో హరీశ్ పేరడీ నటన ఎప్పటికీ నిలిచిపోతుంది. పైగా హరీశ్ చేసిన ప్రతి సినిమా ఆయనకు నటుడిగా ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టింది.
మరి మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి.. హరీష్ కి టాలీవుడ్ లో కూడా తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం ఖాయం. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రంతో మంచి హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్ గా చేస్తుంటే.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.