Happy Re Release Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లో రాజమౌళి ని మించిన బ్రాండ్ ఇమేజ్ అనుకోవచ్చా?, ఆయనకు దరిదాపుల్లో మరో పాన్ ఇండియన్ స్టార్ హీరో లేరు అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదా?, అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఆయన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో చూస్తారు , హిందీ లో చూస్తారు , ముఖ్యంగా కేరళలో అయితే ఎగబడి మరీ చూస్తారు. ఇప్పుడు తమిళ మార్కెట్ మీద ఫోకస్ చేస్తూ , అక్కడి స్టార్ డైరెక్టర్స్ అట్లీ , లోకేష్ కనకరాజ్ లతో సినిమాలు చేస్తున్నాడు, కాబట్టి భవిష్యత్తులో తమిళనాడు లో కూడా అల్లు అర్జున్ మేనియా కనిపించబోతుంది , ఇక కర్ణాటక లో మొదటి నుండి ఆయనకు ఎలాగో విపరీతమైన క్రేజ్ ఉంది , ఓవరాల్ గా ఇండియా లోనే పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అందుకు ఉదాహరణ గా రీసెంట్ గా మలయాళం లో విడుదలైన ‘హ్యాపీ ‘ రీ రిలీజ్ ని చూపిస్తున్నారు. ఈ చిత్రం ద్వారానే 14 ఏళ్ళ క్రితం అల్లు అర్జున్ కి కేరళ లో మార్కెట్ ఏర్పడింది. ఈ సినిమా అప్పట్లో కేరళలో ఒక సెన్సేషన్. అదే చిత్రాన్ని ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది కేరళలో ‘బాహుబలి : ది ఎపిక్’ వసూళ్లను దాటి, ఆల్ టైం హైయెస్ట్ నాన్ మలయాళం ఇండియన్ రీ రిలీజ్ మూవీ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే విధంగా మలయాళం రీ రిలీజ్ లలో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 10 సినిమాలలో , టాప్ 8 చిత్రం గా నిల్చింది. ఇప్పటికీ థియేట్రికల్ రన్ ఆగలేదు , కొనసాగుతూనే ఉంది.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి ఇప్పటి వరకు 93 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి అట. రోజు వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే , ప్రీమియర్స్ + మొదటి రోజు నుండి 29 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 2వ రోజు 25 లక్షలు , 3వ రోజు 31 లక్షలు , 4వ రోజున 15 లక్షలు , 5వ రోజున 17 లక్షలు , 6వ రోజున 14 లక్షలు , 7వ రోజున 10 లక్షలు , 8 వ రోజున 4 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా 8 రోజుల్లో ఈ చిత్రానికి 1 కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు , రేపు వీకెండ్ కావడంతో చెరో 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అదనంగా వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
