Allari Naresh Birthday: హ్యాపీ బర్త్ డే నరేష్.. నవ్వించు.. ఎప్పటికీ ఇలాగే నిలిచిపో !

Allari Naresh Birthday: ‘అల్లరి నరేష్..’ తెలుగు వెండితెరపై నేటి నవ్వుల రారాజు. నేటి తెలుగు హాస్యానికి హీరోయిజమ్ తీసుకొచ్చిన హీరో ఆయన. స్టార్ హీరోల సైతం అభిమానించే నేటి మేటి హాస్య నటుడు నరేష్. ఈ రోజు ‘అల్లరి నరేష్’ పుట్టిన రోజు. 2002లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’ సినిమాతో హీరోగా పరిచయమై.. కామెడీ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను దక్కించుకున్నాడు. హాస్య చిత్రాల హీరోగా అల్లరి చేయడంలో అల్లరి నరేష్ సీమటపాకాయ్ […]

Written By: Shiva, Updated On : June 30, 2022 12:47 pm
Follow us on

Allari Naresh Birthday: ‘అల్లరి నరేష్..’ తెలుగు వెండితెరపై నేటి నవ్వుల రారాజు. నేటి తెలుగు హాస్యానికి హీరోయిజమ్ తీసుకొచ్చిన హీరో ఆయన. స్టార్ హీరోల సైతం అభిమానించే నేటి మేటి హాస్య నటుడు నరేష్. ఈ రోజు ‘అల్లరి నరేష్’ పుట్టిన రోజు. 2002లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’ సినిమాతో హీరోగా పరిచయమై.. కామెడీ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను దక్కించుకున్నాడు.

Allari Naresh

హాస్య చిత్రాల హీరోగా అల్లరి చేయడంలో అల్లరి నరేష్ సీమటపాకాయ్ లా పేలాడు. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టడంలో కూడా అల్లరోడు దిట్ట అనిపించుకున్నాడు. అటు సీమశాస్త్రీగా మడతకాజా తినిపించడంలో.. ఇటు గోపీ అంటూ గోడమీద పిల్లిలా నవ్వులు కురిపించడంలో.. ‘అల్లరి నరేష్’ ఫుల్ సక్సెస్ అయ్యాడు.

Also Read: Meena Husband kill Pigeons: పావురాలే మీనా భర్త ప్రాణాలు తీసిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం

Allari Naresh

ఇలా వీక్షకులను సరదాగా నవ్వించిన ‘అల్లరి నరేష్’కి మధ్యలో హిట్ అనేది లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా హీరోగా వరుస పరాజయాలతో సతమతవుతున్న అల్లరి నరేష్, ప్రయోగాత్మకంగా చేసిన గత సినిమా ‘నాంది’తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. అల్లరి నరేష్ ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ లో నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చాడు. హిట్ కోసం అల్లరి నరేష్ చేసిన ప్రయోగం ఇది.

Allari Naresh

ప్రస్తుతానికి ఈ అల్లరోడు ‘సభకు నమస్కారం’ అంటూ ఆడియన్స్‌ను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఏది ఏమైనా ‘అల్లరి నరేష్..’ ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలతో ఈ జనరేషన్ కి కామెడీ హీరోగా ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

మరి ఈ నేటి నవ్వుల రారాజు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ.. ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం.

Tags