Hanuman Trailer: దర్శకుడు ప్రశాంత్ వర్మ అ, జాంబీ రెడ్డి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు. విలక్షణ సబ్జెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రశాంత్ వర్మ మూవీ అంటే మేటర్ ఉంటుందని జనాలు ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ మూవీ హనుమాన్ టీజర్ తోనే అంచనాలు పెంచేసింది. తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ సృష్టించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హనుమాన్ చిత్రంపై ఒక్కో అప్డేట్ అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
హనుమాన్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. మూడున్నర నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ మెప్పించింది. ట్రైలర్ గమనిస్తే ఇది ఒక సూపర్ మ్యాన్ స్టోరీ. అతీత శక్తులు కలిగిన ట్రైబల్ యువకుడిగా తేజా సజ్జా కనిపిస్తున్నారు. ఇక విలన్ వినయ్ రాయ్. సూపర్ మ్యాన్ గా ఎదగాలని కలలు కనే విజయ్ రాయ్ పరిశోధనలు చేసి ఒక సూట్ రూపొందిస్తాడు.
అయితే ఈ ఆర్టిఫిషియల్ పవర్ కాకుండా సహజంగా తన శరీరంలోనే శక్తి నింపే సాధనం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ పవర్ తేజా సజ్జా వద్ద ఉందని తెలుసుకున్న వినయ్ రాయ్ దక్కించుకునే ప్రయత్నం చేశాడు. తేజా-వినయ్ రాయ్ మధ్య పోరాటంలో గాడ్ హనుమాన్ పాత్ర ఏంటి? ఆయన ఎందుకు మరలా వచ్చాడు? అనేది కథ. హనుమాన్ ట్రైలర్ అంచనాలు పెంచేయగా సంక్రాంతి రేసు ఆసక్తికరంగా మారాయి.
ఒక విధంగా చెప్పాలంటే హిందీలో సక్సెస్ అయిన క్రిష్ సిరీస్ ని తలపిస్తోంది. తెలుగులో సూపర్ హీరో మూవీస్ వచ్చింది చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అయితే లేదు. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక టాలీవుడ్ లో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ ఇది. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య తదితరులు నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.