Hanuman: ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. ఇక ఇలాంటి సమయంలో హనుమాన్ అనే ఒక చిన్న సినిమా ఈ బరిలో పోటి కి దిగుతుంది అది ఎంతవరకు పోటీలో నిలుస్తుంది. ఆ సినిమాని ఎవరు పట్టించుకుంటారు. ఈ మూడు సినిమాల పోరులో ఆ సినిమా నలిగిపోతుంది అంటూ చాలామంది ఇండస్ట్రీ పెద్దలు సైతం ఇంతకు ముందు అహంకారంతో మాట్లాడటం మనం చూశాం.ఇక ఇప్పుడు అనూహ్య రీతిలో హనుమాన్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు విపరీతంగా ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. అలాగే ఈ సినిమా టిక్కెట్ల బుకింగ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
డైరెక్టర్, హీరో ఇద్దరు యంగ్ స్టార్స్ అయినప్పటికీ ఏ మాత్రం తడబడకుండా వాళ్ళు తీసిన సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ తో సంక్రాంతికి రిలీజ్ చేసి ఒక సూపర్ హిట్ ని అందుకున్నారు. మరి ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలకు చెక్ పెట్టే విధంగా హనుమాన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి గుణపాఠం చెప్తుందనే చెప్పాలి.
ఇక ఈ సినిమా వాళ్ల తెలిసిన నీతి ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే చాలు ఎంత పెద్ద సినిమాని అయిన ఓడించవచ్చు అనే ఒక ధైర్యాన్ని మేకర్స్ కి అందించినట్టుగా తెలుస్తుంది. తొక్కిసలాటలో నలిగిపోతుందనుకున్న సినిమానే ఇప్పుడు ఒక్కొక్క సినిమాని తొక్కుకుంటూ పోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టుగా ‘వంగి వంగి నక్కినక్కి కాదు తొక్కుకుంటూ పోవాలే’ అన్నట్టు హనుమాన్ సినిమా కూడా ప్రతి ఒక్క సినిమాని మడతపెట్టేసి ముందుకెళ్తుంది. కుర్రాళ్ళ తో పెట్టుకుంటే తాటతీస్తారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు… పాతిక సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో పాతుకుపోయిన దర్శకులు, ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలను తొక్కలని చూస్తే వాళ్లే పెద్ద సినిమాలను తొక్కేస్తారని మరొకసారి ప్రూవ్ చేసిన సినిమా హనుమాన్… ఈ సినిమాకి హనుమాన్ అనే పేరు పెట్టినందుకు సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది… ఇక ఇప్పుడు ఈ సినిమా టార్గెట్ ఒక్కటే రికార్డ్ లు క్రియేట్ చేయడం…