Hanuman First Review: తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా మీద అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉండటమే అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సినిమా యూనిట్ నుంచి వస్తున్న సమాచారం ఏంటి అంటే సినిమా ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ లో మూవీ కొంచెం డల్ అయినట్టుగా కనిపిస్తుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి సంబంధించి సెకండాఫ్ లో సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందా లేదా అనే డౌట్లు కూడా వస్తున్నాయి…ఇక ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతి పోటీలో ఉంది కాబట్టి ఇప్పటికే వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో పోటీకి దిగుతుంది. మరి ఇలాంటి క్రమంలో సినిమా రిలీజ్ కి ముందే సెకండ్ ఆఫ్ డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది అనే వార్తలు రావడంతో ఆ న్యూస్ ఈ సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి మరి ఇలాంటి క్రమంలో ఈ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుండడం వల్ల సినిమాని కొంతవరకు దెబ్బతీసే ప్రమాదం అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే సంక్రాంతి పోటీలో ఏ కొంచెం డివైడ్ టాక్ వచ్చిన కానీ మిగతా సినిమాలు ఈ సినిమాని డామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక గుంటూరు కారం సినిమా ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ కావడంతో ప్రేక్షకులందరూ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంది.
పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా గుంటూరు కారం సినిమాని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ సినిమాకి కలక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ గుంటూరు కారం సినిమాకి మంచి టాక్ వచ్చి హనుమాన్ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినట్టయితే గుంటూరు కారం సినిమా తప్పకుండా ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. దానివల్ల హనుమాన్ సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే ప్రమాదం కూడా ఉంది. మరి ఈ సంక్రాంతి కి ఏం జరుగుతుందో తెలియాలంటే సంక్రాంతి పండగ వరకు వెయిట్ చేయాలి…