Hanuman First Review: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న హనుమాన్ సినిమా టీజర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చిరంజీవి సినిమా యూనిట్ మొత్తాన్ని ఆశీర్వదించారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాని నైజం లో మైత్రి మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఇక అదే రోజున మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. కాబట్టి దిల్ రాజు హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్లు 96 ఉంటే, అందులో గుంటూరు కారం కోసం 90 థియేటర్లు కేటాయించి, కేవలం 6 థియేటర్లను మాత్రమే హనుమాన్ సినిమా కోసం కేటాయించారు. ఇక దీనిపైన దిల్ రాజు మీద చాలా వ్యతిరేకత అయితే వస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయిన 90 థియేటర్లు తీసుకొని చిన్న సినిమాగా వస్తున్న హనుమాన్ సినిమాకి కేవలం 6 థియేటర్లు మాత్రమే ఇవ్వడం అనేది కరెక్ట్ పద్దతి కాదు అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే హనుమాన్ సినిమాకి మొదటి నుంచి కూడా అన్యాయం జరుగుతూనే వస్తుందంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన నిరంజన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే విషయాన్ని వెల్లడించాడు.
ఈ సినిమాని కావాలనే తొక్కేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడుతూ మా సినిమాకి కేవలం 6 థియేటర్లు ఇచ్చినప్పటికీ పర్లేదు. ఎందుకు అంటే హనుమాన్ సినిమాలో కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ సినిమా తప్పకుండా సంక్రాంతి రేస్ లో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం మాకు ఉంది కాబట్టే మేము సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ లో 1200 థియేటర్లను కేటాయించినట్టుగా కూడా తెలియజేశాడు. ఇక మా సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తే బాలీవుడ్ నుంచి వచ్చిన 1200 థియేటర్లు మిస్ అయిపోతాం కాబట్టి ఈనెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాము అంటూ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి తెలియజేశాడు…
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా చిరంజీవితో పాటు కొంతమంది సినీ ప్రముఖుల కోసం ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాను చూసిన చాలామంది సెలబ్రిటీస్ అయితే సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చాలా తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ చాలా ఉత్తమమైన సినిమా తీశాడు అంటూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. అలాగే తేజ సజ్జ కూడా తనదైన రీతిలో నటించాడు అంటూ అతన్ని మెచ్చుకుంటున్నారు…ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ లో హనుమాన్ చేసే విన్యాసాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అనే వార్తలతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా హిట్టా, ప్లాపా అనేది తెలియాలంటే జనవరి 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…