Hansika Removes Wedding Photos: తెలుగు,తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ హన్సిక(Hansika Motwani). బాలనటిగా కెరీర్ ని మొదలు పెట్టిన ఆమె, మన టాలీవుడ్ లోకి దేశముదురు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇదే హీరోయిన్ గా ఆమెకు మొట్టమొదటి సినిమా కూడా. తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. తెలుగు లో కంటే కూడా ఆమె ఎక్కువగా తమిళం లోనే సినిమాలు చేసింది. అక్కడే ఈమెకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇప్పటికీ తమిళం లోనే ఆమె యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈమె 2022 వ సంవత్సర లో సోహైల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీళ్లిద్దరు విడిపోయారు అంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
సోహైల్ ఆస్తి అంతస్తుల విషయం లో హన్సిక తో పోలిస్తే చాలా పెద్ద. కలలో కూడా ఆయన స్థాయిని హన్సిక కుటుంబం వారు మ్యాచ్ చేయడం అసాధ్యం. అందుకే ఈ రెండు కుటుంబాల మధ్య ఎదో ఒక సందర్భం లో జరిగిన సంఘటన కారణంగా విభేదాలు ఏర్పడ్డాయని, అప్పటి నుండి ఆ విబేధాలు ఒక్కొక్కటిగా పెరిగి విడిపోయే స్థితికి వచ్చిందని, చాలా కాలం నుండి హన్సిక ఇప్పుడు పుట్టింట్లోనే ఉంటుందని, భర్త తో కలిసి లేదని, ఇలా కోలీవుడ్ లో ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ హన్సిక భర్త సోహైల్ మాత్రం అలాంటివేమీ లేదని, నేను హన్సిక సంతోశావంతమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నామని, సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని నమ్మొద్దు అంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
కానీ రీసెంట్ గా హన్సిక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను తొలగించింది. దీంతో ఒక్కసారి గా సోషల్ మీడియా మొత్తం ఉడికిపోయింది. హన్సిక ఫోటోలు తొలగించింది, అంటే కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో జరిగింది అంటూ చెప్పుకొస్తున్నారు. గతం లో విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు కూడా, ముందుగా ఇన్ స్టాగ్రామ్ లో తమకు సంబంధించిన ఫోటోలను తొలగించేవారని, ఇప్పుడు హన్సిక కూడా అదే పని చేయడం తో కచ్చితంగా వీళ్లిద్దరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని ఎవరికీ తోచినట్టు వారు కథనాలు రాస్తున్నారు. మరి దీనికి హన్సిక క్లారిటీ ఇస్తుందా లేదా?, ఒకవేళ క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం నిజంగానే వీళ్లిద్దరు విడిపోతున్నారు అనే అర్థం తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు నెటిజెన్స్. కనీసం ఆమె భర్త అయినా రెస్పాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.