105 Minutes: మొట్ట మొదటిసారి ఏ హీరోయిన్ చేయని రిస్క్ చేసిన హన్సిక

105 Minutes: దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు హీరోయిన్ హన్సిక.  తన నటనతో అందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ, మస్కా ఓ మై ఫ్రెండ్, బిల్లా, కంత్రి లాంటి స్టార్ హీరోలతో సైతం నటించారు. తమిళ తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ ఎదిగారు. ఆ మధ్యకాలంలో కాస్త బొద్దుగా మరి సినిమా ఆఫర్స్ దూరమయ్యారు. ఇప్పుడు తన గ్లామర్ ను పెంచుకొని  మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు ఈ అమ్మడు. ఇండియన్ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 6, 2021 9:18 pm
Follow us on

105 Minutes: దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు హీరోయిన్ హన్సిక.  తన నటనతో అందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ, మస్కా ఓ మై ఫ్రెండ్, బిల్లా, కంత్రి లాంటి స్టార్ హీరోలతో సైతం నటించారు. తమిళ తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ ఎదిగారు. ఆ మధ్యకాలంలో కాస్త బొద్దుగా మరి సినిమా ఆఫర్స్ దూరమయ్యారు. ఇప్పుడు తన గ్లామర్ ను పెంచుకొని  మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు ఈ అమ్మడు. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో రూపొందుతున్న చిత్రం ‘105 మినిట్స్’ రాజు దుస్సా దర్శకత్వం రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మించారు. ఈ చిత్రంలో హన్సిక ప్రధాన పాత్రలో  నటిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సి.యస్ సంగీతం అందించారు.

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో జరిగే తరహా సింగిల్ షాట్ చిత్రీకరణ అంటే ఇష్టం. అలా మనవాళ్ళు చెయ్యట్లేదు అనుకుంటున్న సమయంలో ‘105 మినిట్స్’ పేరుతో సినిమా చేశారు. కథ థ్రిల్లింగ్ గా అనిపించింది. 105 మినిట్స్ సింగిల్ షాట్ అంటే ఎంత కష్టమో ఓ సాంకేతిక నిపుణుడిగా నాకు తెలుసు. మన తెలుగు పరిశ్రమలో ఇలాంటి కొత్త ఆలోచనతో సినిమా తీసినందుకు గర్వంగా ఉంది,ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది ఈ మూవీ విడుదలకు సంబంధించిన విషయాలను ప్రకటించనున్నారు….