వాళ్లంతా అలా చూడటం బాధగా అన్పించింది: హన్సిక

హీరోయిన్ హన్సిక గురించి చిత్రసీమలో తెలియనివారుండరెమో. చైల్డ్ ఆర్టిస్టుగా హన్సిక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పూరి జగన్మాథ్ ధర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకుల పరిచయమైంది. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టందుకొంది. ఈ మూవీలో హన్సిక అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ మూవీ సక్సస్ తో తెలుగు, తమిళంలో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. ఛైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా ఇప్పటికే 50కిపైగా సినిమాలు […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 3:30 pm
Follow us on


హీరోయిన్ హన్సిక గురించి చిత్రసీమలో తెలియనివారుండరెమో. చైల్డ్ ఆర్టిస్టుగా హన్సిక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పూరి జగన్మాథ్ ధర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకుల పరిచయమైంది. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టందుకొంది. ఈ మూవీలో హన్సిక అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ మూవీ సక్సస్ తో తెలుగు, తమిళంలో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. ఛైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా ఇప్పటికే 50కిపైగా సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హన్సిక తన అనుభవాలను తాజాగా అభిమానులతో పంచుకున్నారు.

గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!

నటన అంటే ఏంటో తెలియని వయస్సులో సినిమాల్లోకి వచ్చానని తెలిపింది. తన ఆటపాట అంతా షూటింగ్లోని యూనిట్ సభ్యులతోనే గడిచేదని చెప్పింది. వారందరితో సరదాగా ఎంజాయ్ చేసేదానని.. వాళ్లు తనను ముద్దు చేసేవారని పాతజ్ఞాపకాలను నెమరువేసుకుంది. సెట్లో గ్యాప్ దొరికిన సమయంలో చదువుకుంటూ ఉండేదానని తెలిపింది. స్కూల్లో తనను అందరూ సెలబ్రెటీలా చూసేవారని, టీచర్లు సైతం అదేవిధంగా ట్రీట్ చేయడం కొద్దిగా బాధగా అన్పించేందని తెలిపింది. సినిమాల వల్ల తన చిన్నతనం కొల్పోయాననే ఆలోచన ఎప్పుడు రాలేదని హన్సిక చెప్పింది.

గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా!

చిన్నతనం నుంచి తన వ్యవహారాలన్ని తన తల్లే చూసుకునేదని చెప్పింది. ఇప్పటికీ కూడా తన రెమ్యూనరేషన్, డబ్బు వ్యవహారాలన్నీ తానే చూసుకుంటుందని చెప్పింది. దర్శకులు నాకిచ్చే రెమ్యూనరేషన్ ఎంతో కూడా తెలుసుకోనని చెప్పింది. అలాగే తనకు కార్లు డ్రైవ్ చేయడం ఇష్టమని వివరించింది. తెలుగులో స్టార్డమ్ సంపాదించుకున్న హన్సిక తెలుగులో చివరగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో అతిథి పాత్రలో కన్పించింది. ప్రస్తుతం తమిళంలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది.