Guntur Kaaram First Glimpse: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యగా, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మహేష్ ని చాలా కాలం తర్వాత ఊర మాస్ అవతార్ లో చూసిన ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
అంతే కాదు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాటిట్యూడ్, ఇలా అన్నీ కూడా వింటేజ్ మహేష్ బాబు ని చూసిన అనుభూతి కలిగింది అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. కేవలం ఒక్క షెడ్యూల్ లో ఇంత మంచి ఔట్పుట్ ఇచ్చాడంటే, ఈసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కి రీసౌండ్ వచ్చే రేంజ్ హిట్ ఇస్తారని అనుకుంటున్నారు ఫ్యాన్స్. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ పరంగా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయినప్పటికీ, నేటి తరం యూత్ కి తెగ నచ్చేసింది.
ఇక గ్లిమ్స్ వీడియో రికార్డుల విషయానికి వస్తే వ్యూస్ పరంగా సౌత్ లోనే ఆల్ టైం రికార్డుని నెలకొపిన ఈ చిత్రం, లైక్స్ పరంగా మాత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి ఆమడ దూరం లోనే ఆగిపోయింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లిమ్స్ వీడియో కి 24 గంటల్లో నాలుగు లక్షల 70 వేల లైక్స్ వచ్చాయి.
కానీ ‘గుంటూరు కారం’ గ్లిమ్స్ వీడియో కి మాత్రం కేవలం మూడు లక్షల 50 వేల లైక్స్ మాత్రమే వచ్చాయి. వ్యూస్ పరంగా 23 మిలియన్ కి చేరుకున్న ఈ గ్లిమ్స్ కి, లైక్స్ విషయం లో ఇంత వెనకబడడానికి కారణం ఏమిటి అని తలలు బాదుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. వ్యూస్ ఆ రేంజ్ లో రావడానికి కారణం యాడ్స్ వెయ్యడం వల్లే అని, యాడ్స్ వల్ల వ్యూస్ అయితే బాగా వస్తాయి