Guntur Karam Movie: చిక్కుల్లో గుంటూరు కారం… సినిమా రద్దవుతుందా?

జయాపజయాలతో సంబంధం లేకుండా మహేష్-త్రివిక్రమ్ కాంబోకి ఓ క్రేజ్ ఉంది. అది చాలా కాలం తర్వాత సాకారం కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ ప్రాజెక్ట్ ఆరంభం నుండి ఒడిదుడుకులతో సాగుతుంది. షూటింగ్ మొదలయ్యాక స్క్రిప్ట్ మార్చారు. షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ జరగలేదు. దాంతో యాక్టర్స్ కాల్ షీట్స్ ప్రాబ్లమ్ వచ్చింది. పూజా హెగ్డేను సెకండ్ హీరోయిన్ గా డిమోట్ చేయడంతో అలిగి ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోయింది. థమన్ మరొక సమస్య. ఆయన టైం కి ట్యూన్స్ ఇవ్వడం లేదని టాక్.

Written By: Shiva, Updated On : July 22, 2023 2:23 pm

Guntur Karam Movie

Follow us on

Guntur Karam Movie: ఏ ముహూర్తాన మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ చేశారో తెలియదు కానీ… అన్నీ అవాంతరాలే. ఒక్కొక్కరిగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నారు. అసలు సమస్య ఎక్కడుందో అర్థం కావడం లేదు. దాదాపు 13 ఏళ్ల అనంతరం మహేష్ తో త్రివిక్రమ్ మూవీ చేస్తున్నారు. గతంలో వీరు అతడు, ఖలేజా చిత్రాలు చేశారు. రెండూ కమర్షియల్ గా ఆడలేదు. అతడు మూవీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్రం బుల్లితెర టీఆర్పీ కింగ్ గా ఉంది. అతడు ఎప్పుడు ప్రసారమైనా వదలకుండా చూస్తారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా మహేష్-త్రివిక్రమ్ కాంబోకి ఓ క్రేజ్ ఉంది. అది చాలా కాలం తర్వాత సాకారం కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ ప్రాజెక్ట్ ఆరంభం నుండి ఒడిదుడుకులతో సాగుతుంది. షూటింగ్ మొదలయ్యాక స్క్రిప్ట్ మార్చారు. షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ జరగలేదు. దాంతో యాక్టర్స్ కాల్ షీట్స్ ప్రాబ్లమ్ వచ్చింది. పూజా హెగ్డేను సెకండ్ హీరోయిన్ గా డిమోట్ చేయడంతో అలిగి ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోయింది. థమన్ మరొక సమస్య. ఆయన టైం కి ట్యూన్స్ ఇవ్వడం లేదని టాక్.

థమన్ పనితనం నచ్చని మహేష్ పక్కన పెట్టేశాడని ప్రచారమైంది. కానీ థమన్ ప్రాజెక్ట్ లో ఉన్నాడు. తాజాగా మరొక వికెట్ అవుట్ అంటున్నారు. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ గుంటూరు కారం టీమ్ కి గుడ్ బై చెప్పేశాడట. దర్శకుడు త్రివిక్రమ్ తో తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వినోద్ గుంటూరు కారం సినిమా నుండి తప్పుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ గత రెండు చిత్రాలు అరవింద సమేత, అల వైకుంఠపురంలో చిత్రాలకు వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఇక మహేష్ లండన్ లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చాక షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ లోపు మరో కెమెరామెన్ కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇంత అస్తవ్యస్తంగా ప్రాజెక్ట్ నడుస్తుంటే అవుట్ ఫుట్ దారుణంగా వస్తుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికి ఇంత గందరగోళం నెలకొనలేదు. చివరికి గుంటూరు కారం ఎవరి కళ్ళలో కొడతారో అనే చర్చ నడుస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు.