Guess The Actress: కొన్ని సినిమాల్లో నటించిన వారు ప్రత్యేకంగా ఆకట్టుకుంటారు. మెయిన్ నటుల కంటే వీరికే గుర్తింపు ఉంటుంది. సినిమా స్టోరీ మొత్తం వారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ తరువాత వారు పెద్దగా సినిమాల్లో కనిపించరు. సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ సినిమాలో హీరోయిన్ తో పాటు సమానంగా కనిపించిన ఓ నటి ఆ తరువాత కొన్ని సినిమాల్లో కనిపించింది. ఆ తరువాత కనుమరుగైపోయింది. కానీ ఇటీవల సోషల్ మీడియాలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. అప్పటికంటే ఇప్పుడే ఎంతో అందంగా తయారైన ఆమెను చూసి ఇంప్రెస్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా నటి? ఇప్పుడేం చేస్తుంది?
పై ఫొటోలోని అమ్మాయిని చూస్తే ఎవరో గుర్తుపట్టలేరు. కానీ ఆమె నటించిన సినిమా పేరు చెప్పగానే గుర్తుకు వస్తుంది. ఎన్నో సినిమాల్లో నటించినా సౌత్ లో నటించిన తరువాతే ఆమెకు పాపులారిటీ వచ్చింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారు. ఆమె పేరు పియా బాజ్ పాయ్. ఈమె మొదటిసారిగాతమిళంలో 2008లో ‘పోయ్ సొల్ల పోరమ్’ లో నటించింది. కానీ ఆ తరువాత తెలుగులో నిన్ను కలిశాక అనే సినిమాలో మెరిసింది. కానీ అప్పటికీ గుర్తింపు రాలేదు.
ఆ తరువాత ‘రంగం’ సినిమాతో అమ్మడుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు జర్నలిస్టు పాత్రలో నటించిందీ ముద్దుగుమ్మ. అంతేకాకుండా ఈమెతోనే సినిమా మలుపు తిరుగుతుంది. రంగంలో నటించిన తరువాత పియా బాజ్ పేయ్ కు అవకాశాలు అడపాదడపా వచ్చాయి. అలా 2018 వరకు తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో కనిపించింది. ఈ ఏడాది ఓటీటీలో ‘లాస్ట్’ అనే సిరీసులో కనిపించింది.
రంగం సినిమాలో సాధారణ అమ్మాయిలా కనిపించిన పియా బాజ్ పేయి ఇప్పుడు మరింత అందంగా తయారైంది. అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిక్స్ ను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. మరి ఈ బ్యూటీపై మీరేం కామెంట్ చేస్తారు? **