Guess Actress Daksha Nagarkar: ఈ సినిమాలో వెంకటేష్ పెద్దోడిగా, మహేష్ బాబు చిన్నోడిగా తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీ హిట్ సాధించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చాలామంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా అంజలి, మహేష్ బాబు కి జోడిగా సమంత నటించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు ఆడియన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే ఎవర్ గ్రీన్ సినిమాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా ఒకటి. వెంకటేష్, మహేష్ బాబు మల్టీ స్టార్ గా వచ్చిన ఈ సినిమా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమా పాటలు ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో పాటు వెంకటేష్ యాక్టింగ్ కూడా అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో అంజలి, సమంత, జయసుధ, ప్రకాష్ రాజ్, అభినయ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు మహేష్ బాబు, వెంకటేష్.
దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. టీవీలలో ఈ సినిమా ప్రసారం అవుతుంది అంటే చాలామంది అభిమానులు ఎంతో ఇష్టంగా చూస్తారు. ఈ మధ్యకాలంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కూడా అయ్యింది. ఇక రీ రిలీజ్ లో ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరో మహేష్ బాబుతో ఓ సన్నివేశంలో కనిపించిన అమ్మాయి గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో మీరు గుర్తుపట్టారా.
ఈ సినిమాలో హీరో మహేష్ బాబును హైదరాబాద్కు పంపించడానికి వెంకటేష్ కూడా రైల్వే స్టేషన్ కి వచ్చే సీన్లో కనిపించిన అమ్మాయి ప్రస్తుతం తెలుగులో క్రేజీ హీరోయిన్. ఈమె పేరు దక్ష నాగర్కర్. ఈమె ఏకే రావు పీకే రావు, హోరాహోరీ, హుషారు వంటి సినిమాలలో నటించింది. కానీ ఈమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత రిలీజ్ అయిన జాంబీ రెడ్డి సినిమాతో దక్ష నాగర్కర్తో బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దక్ష. అలాగే అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన బంగార్రాజు సినిమాలో కూడా దక్ష ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
View this post on Instagram