Shock to Raja Saab Movie: తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ ఇక పై పెద్ద సినిమాలకు రావడం కష్టమేనా..?, రెండు రాష్ట్రాలకు సంబంధించిన హై కోర్టులు టికెట్ రేట్స్ పెంపుకు వ్యతిరేకంగా ఉండడమే అందుకు కారణమా?, ఇకపై అభిమానులకు ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ చూసే అదృష్టం కూడా ఉండదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన వాడు కాబట్టి, ఆయన చొరవ తో అతి కష్టం మీద అయినా టికెట్ రేట్స్ తెచుకోవచ్చేమో కానీ, తెలంగాణ లో మాత్రం ఇక కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గానే ‘అఖండ 2’ కి ప్రీమియర్ షోస్ మరియు రెగ్యులర్ షోస్ కి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. కోర్టు లో దీనికి వ్యతిరేకంగా కేసు ఇచ్చారు. తీర్పు ఇచ్చే లోపు ప్రీమియర్ షోస్ పడిపోయాయి కానీ, రెగ్యులర్ షోస్ మొదలయ్యే సమయానికి తీర్పు రావడం తో ప్రభుత్వం జారీ చేసిన జీవో ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సంక్రాంతికి ‘రాజా సాబ్'(The Rajasaab), ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. రెండు పెద్ద సినిమాలే, కానీ ‘రాజా సాబ్ ‘ కి భారీ బడ్జెట్ ఖర్చు అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా 250 కోట్ల పైమాటే. అంటే 250 కోట్లకు పైగా షేర్ వసూళ్లు రావాలి అన్నమాట. ఆ రేంజ్ షేర్ రావాలంటే కచ్చితంగా టికెట్ రేట్స్ పెంచాల్సిందే. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలకు అత్యధిక శాతం వసూళ్లు ఓపెనింగ్స్ లోనే వచేస్తుంటాయి. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ వంటి హీరోలకు టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ పడుతాయి. కాబట్టి కనీసం ఆ మూడు రోజులైనా టికెట్ రేట్స్ పెంచాల్సిందే.
అప్పటికి కానీ బయ్యర్స్ సేఫ్ అవ్వరు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా లేవు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇక మీదట నిర్మాతలు చీటికీ మాటికీ ప్రభుత్వం చుట్టూ తిరగకుండా, ఒక యూనిఫార్మ్ టికెట్ రేట్స్ జీవో ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు వర్తించేలా చూస్తున్నారట. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం లో అయితే టికెట్ రేట్స్ ఈసారి దక్కడం చాలా కష్టమని అంటున్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి అయితే ఆ అంశం గురించి మాట్లాడే పని అయితే నా దగ్గరకు రావొద్దు అని నేరుగా నిర్మాతలకు చెప్పేశాడట. దీంతో రాజాసాబ్ మేకర్స్ ఇక వేరే దారి లేక , జనవరి 8 సాయంత్రం 6 గంటల నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ని ప్రారంభించాలని అనుకుంటున్నాడట , చూడాలి మరి ఏమి జరగబోతుందో.