CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నాటకీయ మలుపులు తిరుగుతున్నాయి. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారే ఓ వాదన హల్ చల్ చేస్తోంది. దీనికి చంద్రబాబు సైతం రెడీగానే ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు భయం అందరిలో పట్టుకుంది. తెలంగాణతో పాటు జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు జగన్ కు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? వెళితే ఏం ప్రయోజనం? అనే విషయాలు పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. అప్పులతోనే నెట్టుకొస్తున్నారు. ప్రతి నెల అప్పులతోనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మరో మూడేళ్లు నడపాలంటే లక్షల కోట్లు అయినా చాలవు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్లు ఓ వాదన వినిపిస్తోంది. దీంతో జగన్ మదిలో ఏముందో తెలియడం లేదు. కానీ ముందస్తు ఎన్నికల ప్రచారం మాత్రం ఏపీలో వైరల్ అవుతోంది.
Also Read: ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే డబ్బుకు కొదవ ఉండదు!
సంక్షేమ పథకాల అమలుకు కూడా ఎడాపెడా అప్పులు చేయాల్సి వస్తోంది. రాష్ర్టంలో ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలను అందించే పనిలో జగన్ ఉండటంతో నిధుల కొరత వెంటాడుతోంది. దీంతో ఇంకా మూడేళ్లు ప్రభుత్వాన్ని నడపాలంటే నిధుల సమస్య వేధిస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇక మూడు రాజధానుల వ్యవహారం కూడా ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత కూడా ఎక్కువవుతోంది. అందుకే త్వరగా ఎన్నికలకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదని తెలుస్తోంది. అందుకే మూడు రాజధానుల వ్యవహారంలో ఏదో ఒక ఫలితాన్ని తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది ఇప్పట్లో తేలేలా లేదు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ప్రజలు ప్రశ్నిస్తారనే భయం కూడా వెంటాడుతోంది. ఈ క్రమంలో జగన్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. విశాఖలో భారీ వేతనంతో జాబ్ మేళా?