https://oktelugu.com/

Suresh Productions vs Geetha Arts: సురేష్ ప్రొడక్షన్స్ కథను గీతా ఆర్ట్స్ కాపీ కొడుతుందా ?

Suresh Productions vs Geetha Arts: హిట్ లేక, ఇక కెరీర్ పై ఆశలు వదిలేసుకున్న చివరి క్షణాల్లో త‌మిళ మాజీ లవర్ బాయ్ ‘శింబు’కి భారీ హిట్ వచ్చింది. ఆ సినిమా పేరే ‘మ‌న్నాడు’. సినిమా చాలా బాగుంటుంది. అందుకే, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడ్డారు. అయితే, ఓ దశలో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నార‌ని వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి […]

Written By:
  • Shiva
  • , Updated On : January 5, 2022 / 12:36 PM IST
    Follow us on

    Suresh Productions vs Geetha Arts: హిట్ లేక, ఇక కెరీర్ పై ఆశలు వదిలేసుకున్న చివరి క్షణాల్లో త‌మిళ మాజీ లవర్ బాయ్ ‘శింబు’కి భారీ హిట్ వచ్చింది. ఆ సినిమా పేరే ‘మ‌న్నాడు’. సినిమా చాలా బాగుంటుంది. అందుకే, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడ్డారు. అయితే, ఓ దశలో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నార‌ని వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి తీసుకుంది అన్నారు.

    Suresh Productions

    అల్లు శిరీష్ హీరోగా ఈ సినిమాను తెలుగులో చేయబోతున్నారని టాక్ కూడా నడిచింది. అయితే, ఈ సినిమా రైట్స్ ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తీసుకుంది. డబ్బింగ్ రైట్స్ కాదు, రీమేక్ రైట్స్. తెలుగులో త్వరలోనే ఈ సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ రీమేక్ చేయ‌బోతోంది. ఇందులో రానా హీరోగా నటిస్తాడని అంటున్నారు. కాకపోతే ఈ మ‌న్నాడు సినిమా కథను కాపీ కొట్టి, తెలుగులో ఆల్ రెడీ ఓ చిత్రం స్టార్ట్ చేశారట.

    Geetha Arts

    ఈ విష‌యం సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ కి తెలియడంతో వెంటనే అప్రమత్తం అయి, ‘మ‌న్నాడు’ రీమేక్ రైట్స్ పై ఓ లీగ‌ల్ నోటీస్ ను బయటకు వదిలింది. మన్నాడు సినిమా రైట్స్ మేము తీసుకున్నాం, మా సినిమాలో ఏ పార్ట్ అయినా కాపీ కొట్టినా, ప్రేరణ పేరుతో కొన్ని సన్నివేశాలను కాపీ కొట్టినా మేము చ‌ట్టప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామంటూ సురేష్ ప్రొడక్షన్ తాజాగా ఒక మెసేజ్ ను కూడా పెట్టింది.

    Also Read: ఇప్పుడు రాజమౌళికి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ అదే !
    ఇంతకీ మన్నాడు సినిమాని కాపీ కొట్టింది ఎవరు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. కాగా గీతా ఆర్ట్స్ లోనే ‘మ‌న్నాడు’ సినిమా కథను పోలిన ఓ కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. మ‌న్నాడు కథ బన్నీ వాసుకి బాగా నచ్చింది అని, అందుకే.. గీతా ఆర్ట్స్ లో అలాంటి కథనే రెడీ చేయిస్తున్నాడని పుకార్లు మొదలయ్యాయి.

    మరి నిజంగానే మన్నాడు కథను మరో కోణంలో రాయిస్తుంటే కచ్చితంగా లీగల్ గా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మ‌న్నాడు పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

    Also Read: అనుకున్నట్టే అయిన “రాధే శ్యామ్” రిలీజ్… నిరాశలో అభిమానులు ?

    Tags