Allu Arjun -Sneha Reddy : సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి చాలా యాక్టీవ్. ఈ క్రమంలో స్నేహా రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గ్లామరస్ ఫోటో షూట్స్ తో స్నేహారెడ్డి మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ మధ్య స్నేహారెడ్డి ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటో షూట్స్ అప్లోడ్ చేస్తున్నారు. ప్రముఖ డిజైనర్ ప్రీతమ్ జవాల్కర్ రూపొందించిన బట్టలలో స్నేహారెడ్డి స్టార్ లేడీ మాదిరి మెస్మరైజ్ చేస్తున్నారు. స్నేహారెడ్డి అందం చూసిన సోషల్ మీడియా జనాలు ఆమె ఇద్దరు పిల్లల తల్లి అంటే అసలు నమ్మలేం అంటున్నారు.
స్టార్ హీరోయిన్ మాదిరి స్నేహారెడ్డి ఫోటో షూట్స్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే సందేహం మొదలైంది. దీనికి బలమైన కారణమే ఉందంటున్నారు కొందరు. స్నేహారెడ్డి చదువుకునే రోజుల్లో హీరోయిన్ కావాలి అనుకున్నారట. తల్లిదండ్రులు ససేమిరా అనడంతో తన కోరిక చంపుకున్నారట. నటి కావాలన్న ఆమె కోరిక బలంగా అలానే మనసులో ఉండిపోయిందట. స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ ఇందుకే చేస్తుంది అంటున్నారు. హీరోయిన్ కాకపోయినా కనీసం ఇలా తన కోరిక తీర్చుకుంటున్నారట.
అల్లు అర్జున్ తో ప్రేమలో పడటానికి, ఆయనతో ఏడడుగులు నడవడానికి సినిమా నేపథ్యం కూడా ఒక కారణం అంటున్నారు. ఇటీవల స్నేహారెడ్డి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఓ స్టార్ హీరో మూవీలో ఆమె కీలక రోల్ చేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇంస్టాగ్రామ్ లో స్నేహారెడ్డిని 8.6 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. ఓ హీరో భార్యకు ఈ రేంజ్ ఫాలోయింగ్ ఊహించనిదే. మాజీ హీరోయిన్, మిస్ ఇండియా మహేష్ వైఫ్ నమ్రతా శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కేవలం 2.5 మిలియన్ కావడం గమనార్హం.
కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక ఫంక్షన్ లో స్నేహారెడ్డి, అల్లు అర్జున్ కలిశారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. అల్లు అర్జున్ తో వివాహానికి స్నేహారెడ్డి తండ్రి సుధాకర్ రెడ్డి ఒప్పుకోలేదట. స్నేహారెడ్డి సీరియస్ నెస్ అర్థం చేసుకున్న ఆయన చివరకు పెళ్ళికి ఒప్పుకున్నారట. 2011 మార్చ్ 12న బన్నీ-స్నేహారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. వీరికి అయాన్, అర్హ అనే అమ్మాయి, అబ్బాయి సంతానం.