https://oktelugu.com/

Tollywood Hero : డైరెక్టర్ల మీద డిపెండ్ అవ్వని ఒకే ఒక స్టార్ హీరో ఎవరో తెలుసా..?

మంచి కథతో ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి దర్శకుడికి సినిమా చేసే ఛాన్సులు ఇస్తూ ఉంటాడు. అందుకే ఇండస్ట్రీలో మిగతా హీరోలు వేరు, పవన్ కళ్యాణ్ వేరు అని చెప్తూ ఉంటారు...

Written By: , Updated On : January 25, 2024 / 09:47 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Tollywood Hero : చాలామంది స్టార్ హీరోలు దర్శకుల మీద డిపెండ్ అయి సినిమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్లైతేనే ఆ హీరోలను చాలా బాగా చూపిస్తారు అని నమ్ముతారు, అలాగే ఆ దర్శకుల మార్కెట్ కూడా సినిమాకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతోనే ఒక స్టోరీని సినిమాగా తీసే క్రమంలో మన స్టార్ హీరో లు ఆ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలు అందరూ చేసే పని ఇదే, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరో మాత్రం దర్శకులను అసలు పట్టించుకోడు. ఆయన ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే దానికి పెద్ద దర్శకుడు ఉండాల్సిన పనిలేదు. దర్శకత్వ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే మంచి కథ ఉంటే చాలు వాళ్ళకి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు ప్రూవ్ చేశాడు. గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను డైరెక్ట్ చేసే అవకాశాన్ని డాలీ అనే ఒక చిన్న సినిమాలు చేసుకునే డైరెక్టర్ కి ఇచ్చాడు. ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో సాగర్ కే చంద్ర అనే ఒక యంగ్ డైరక్టర్ కి అవకాశం ఇచ్చాడు.

ఇక ఇదే ప్లేస్ లో వేరే స్టార్ హీరోలు ఉంటే స్టార్ డైరెక్టర్లను తీసుకొచ్చి వాళ్ల చేత డైరెక్షన్ చేయించుకునే వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ కి స్టార్ డైరెక్టర్ల తో పనిలేదు. తనని తనే నమ్ముకొని ముందుకు వెళ్తాడు.ఇక ఈయన సినిమాలు కొంచెం హిట్ టాక్ వస్తే చాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాకుండా భారీ రేంజ్ లో కలెక్షన్స్ ని వసూలు చేస్తాయి. ఇక దీనివల్ల కొత్తగా వచ్చే డైరెక్టర్లకి కూడా స్టార్ హీరోలతో పని చేసినట్టుగా ఉంటుంది.

అలాగే వాళ్లకి కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావడమే కాకుండా వాళ్లు కూడా పెద్ద దర్శకులుగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పెద్ద దర్శకుల మీద డిపెండ్ అయిన పరిస్థితి అయితే లేదు. మంచి కథతో ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి దర్శకుడికి సినిమా చేసే ఛాన్సులు ఇస్తూ ఉంటాడు. అందుకే ఇండస్ట్రీలో మిగతా హీరోలు వేరు, పవన్ కళ్యాణ్ వేరు అని చెప్తూ ఉంటారు…