https://oktelugu.com/

Hari Hara Veera Mallu: నిర్మాతల షూటింగ్ బంద్.. ‘హరిహర వీరమల్లు’ పరిస్థితేంటి? ఫ్యాన్స్ లో ఆందోళన

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మొదటి ‘చారిత్రక చిత్రం’ ఇదీ. హరిహర వీరమల్లు లాంటి సమరయోధుడి కథను పవన్ కళ్యాణ్ హీరో విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, కంచె, హిందీ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తీసిన క్రిష్ కు ఈ సినిమా పెద్ద కష్టం కాదు. కేవలం రెండు నెలల్లో గొప్ప క్వాలిటీతో సినిమాలు తీయడంలో క్రిష్ ది అందెవేసిన చేయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2022 / 09:27 PM IST
    Follow us on

    Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మొదటి ‘చారిత్రక చిత్రం’ ఇదీ. హరిహర వీరమల్లు లాంటి సమరయోధుడి కథను పవన్ కళ్యాణ్ హీరో విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, కంచె, హిందీ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తీసిన క్రిష్ కు ఈ సినిమా పెద్ద కష్టం కాదు. కేవలం రెండు నెలల్లో గొప్ప క్వాలిటీతో సినిమాలు తీయడంలో క్రిష్ ది అందెవేసిన చేయి. వేగంగా సినిమాలు తీస్తాడని పేరుంది. కానీ ఎమైందో కానీ ఈ సినిమా ముందుకు సాగడం లేదు.

     

    Hari Hara Veera Mallu

    హరిహర వీరమల్లు లాంటి అద్భుతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ చేసే కత్తి ఫైట్లు, స్టిల్స్, టీజర్ లు చూసి పవన్ ఫ్యాన్స్ అబ్బురపడ్డారు. పవన్ సాహసాలకు ఫిదా అయ్యారు. పవన్ ను ఒక చారిత్రక యోధుడిగా చూపించే ఇలాంటి సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అందరూ ఎదురుచూశారు. కానీ పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ ప్రస్థానంతో ఈ సినిమాకు అడ్డంకులు పడ్డాయి. అయితే దర్శకుడు క్రిష్ వేగం సరిపోతుందని ‘హరిహర వీరమల్లు’ రెండు నెలల్లో పూర్తవుతుందని అంతా అనుకున్నారు.

    కానీ కట్ చేస్తే సినిమా ఆలస్యమైంది. మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు.. కరోనా వల్ల సినిమా పూర్తవలేదు. సగం మాత్రమే పూర్తయ్యి పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వేచిఉండేలా చేసింది. మధ్యలో పవన్ ‘భీమ్లానాయక్’ సహా పలు చిత్రాలతో బిజీ కావడంతో ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేయలేకపోయాడు. తీరా ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’తోపాటు ‘వినోదయ సీతమ్’ రిమేక్ మూవీకి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చిన వేళ అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ వచ్చింది. ఆయన కోలుకోవడానికి కాస్త సమయం పట్టింది.

    ఇక అంతా సెట్ అవుతుందనుకుంటున్న టైంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు మరో గ్రహణం పట్టింది. ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ నిర్మాతలు తమకు నష్టాలు వస్తున్నాయని.. ఏం మిగలడం లేదని షూటింగ్ లు బంద్ పెడుతున్నారు. దీంతో ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ వృథా కానున్నాయి.అలా హరిహర వీరమల్లు సినిమా పూర్తవ్వడం మరింత ఆలస్యం కానుంది.

    ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాపై కోట్లు ఖర్చుపెట్టాడు. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఈ చారిత్రక సినిమా ముందుకు సాగడం లేదు. డేట్స్ ఇచ్చినా అడ్డంకులతో పూర్తి కావడం లేదు. మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి తాజాగా డేట్స్ ఇవ్వగా నిర్మాతల షూటింగ్ ల బంద్ తో బ్రేక్ పడింది. దీంతో ఈ ‘హరిహర వీరమల్లు’ సినిమాకు ఏంటీ పరిస్థితి అని..? ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    తన అభిమాన హీరో పవన్ సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మిగతా హీరోలందరిలోకి పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు. పవన్ సినిమా విడుదల అంటే అందరికీ ఒక పండుగలాంటి వాతావరణం. అందుకే పవన్ ఎప్పుడూ చేయని చారిత్రక పాత్ర పోషించిన ‘హరిహర వీరమల్లు’ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందో ఎదురుచూడాలి.