Heroine Laya : అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హీరోయిన్ లయ నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!

Heroine Laya : టాలీవుడ్ లో నటన ద్వారా ఇండస్ట్రీ లో నెగ్గుకొచ్చే హీరోయిన్లు దొరకడం చాలా అరుదు,అలాంటి హీరోయిన్స్ లో ఒకరు లయ.అందం తో పాటుగా అద్భుతమైన అభినయం కనబరిచే లయ బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే, ఇందులో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను, లయ కి ఉత్తమ […]

Written By: NARESH, Updated On : March 30, 2023 10:19 pm
Follow us on

Heroine Laya : టాలీవుడ్ లో నటన ద్వారా ఇండస్ట్రీ లో నెగ్గుకొచ్చే హీరోయిన్లు దొరకడం చాలా అరుదు,అలాంటి హీరోయిన్స్ లో ఒకరు లయ.అందం తో పాటుగా అద్భుతమైన అభినయం కనబరిచే లయ బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.

ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే, ఇందులో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను, లయ కి ఉత్తమ నటిగా ‘నంది అవార్డు’ దక్కింది.అలా తొలి సినిమాతోనే నంది అవార్డు లాంటి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఏకైక హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది లయ.కెరీర్ లో ఏడాదికి 8 సినిమాలు చేసే లయ 2006 వ సంవత్సరం లో అమెరికా కి చెందిన ఒక డాక్టర్ ని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిపోయి సినిమాలకు గుడ్ బై చెప్పేసారు.

సినిమాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత ఈమె 2011 వ సంవత్సరం నుండి సాఫ్ట్ వేర్ రంగం లో ఉద్యోగం చేసేడట.ప్రముఖ MNC కంపెనీ లో డెవలపర్ జాబ్ చేసే లయ నెలకి 12000 డాలర్లు సంపాదించేదట.అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 9 లక్షల 40 వేల రూపాయిలు అన్నమాట.2017 వరకు ఉద్యోగం చేసిందట,ఆ తర్వాత ఆ జాబ్ మానేసి స్వయంగా ఒక డ్యాన్స్ స్కూల్ ని ఏర్పాటు చేసిందట, కరోనా వచ్చినప్పుడు ఈ స్కూల్ కూడా మూసి వెయ్యాల్సి వచ్చిందట.

అప్పటి నుండి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ నెటిజెన్స్ కి బాగా పరిచయం అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది లయ.చాలా కాలం తర్వాత ఇండియాలోకి అడుగుపెట్టిన లయ,ఈమధ్య వరుసగా ఇంటర్వ్యూస్ ఇచ్చింది, ఈ ఇంటర్వ్యూస్ లో ఈమె తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది, అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.