https://oktelugu.com/

Taraka Ratna : తారకరత్న తన వేల కోట్ల ఆస్తులను ఏమి చేసాడో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

Taraka Ratna : నందమూరి తారకరత్న చనిపోయిన తర్వాత అతని గురించి సోషల్ మీడియా లో ఎవ్వరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.అవి వింటే ఎలాంటి వాడికైనా కనీళ్ళు రాక తప్పదు.నందమూరి తారకరామారావు బ్రతికి ఉన్న రోజుల్లో తాను సంపాదించిన ఆస్తులను తన బిడ్డలందరికీ సమానం గా పంచాడు.కానీ తారకరత్న తండ్రి నందమూరి మోహన్ కృష్ణ కి పంచిన ఆస్తులు మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో వృద్ధిచెంది సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అయ్యిందట. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 24, 2023 / 09:32 PM IST
    Follow us on

    Taraka Ratna : నందమూరి తారకరత్న చనిపోయిన తర్వాత అతని గురించి సోషల్ మీడియా లో ఎవ్వరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.అవి వింటే ఎలాంటి వాడికైనా కనీళ్ళు రాక తప్పదు.నందమూరి తారకరామారావు బ్రతికి ఉన్న రోజుల్లో తాను సంపాదించిన ఆస్తులను తన బిడ్డలందరికీ సమానం గా పంచాడు.కానీ తారకరత్న తండ్రి నందమూరి మోహన్ కృష్ణ కి పంచిన ఆస్తులు మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో వృద్ధిచెంది సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అయ్యిందట.

    అయితే తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తారకరత్న కి ఇవ్వలేదని, ప్రపంచం లో ఒక తండ్రి తన కొడుకు పై ఇంత కఠినంగా వ్యవహరించడం ఎక్కడా చూసి ఉండము అంటూ నందమూరి అభిమానులు వాపోతున్నారు.తండ్రి మోహన కృష్ణ వల్ల తారకరత్న ఆర్థికంగానూ, మానసికంగానూ ఎంతో క్షోభకి గురయ్యాడని, వేలకోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా అతని తండ్రి తారకరత్న ని అనుభవించకుండా చేసాడని తారకరత్న స్నేహితులు చెప్తున్నారు.

    తారకరత్న మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ చిత్రం ప్రారంభమైన రోజే 9 సినిమాలు చెయ్యడానికి సంతకం చేసాడు.అందులో కేవలం 5 సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి..మిగిలిన నాలుగు సినిమాలు ఫైనాన్సియల్ ఇబ్బందుల కారణం గా విడుదల కాలేదు.తారకరత్న తండ్రి చొరవ తీసుకొని ఉండుంటే ఆ సినిమాలను నిర్మించడం పెద్ద కష్టమేమి కాదు, కానీ నాకు ఎందుకులే అన్నట్టు ఆయన ధోరణి ఉండేదని తారకరత్న మిత్రులు చెప్తున్నారు.

    తారకరత్న మధ్యలో చాలా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకున్నాడని, అమెరికా కి వెళ్ళినప్పుడు తన ఖర్చులకు కూడా డబ్బులు పెట్టుకోలేనంత ఇబ్బందులకు గురయ్యాడని, తారకరత్న తండ్రికి ఇవన్నీ తెలిసి కూడా తనకేమి పట్టనట్టు ఉండేవాడని తెలుస్తుంది.ఇక తనకి ఇష్టం లేని పెళ్లి అలేఖ్య రెడ్డి తో చేసుకోవడం తో కనీసం ఇంటి గడప కూడా తొక్కనివ్వలేదని, దీనితో తారకరత్న ఇల్లు వదిలి హైదరాబాద్ లోని మోకిలా లో తన కష్టార్జీతం తో సొంత ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నాడని, చనిపోయిన తర్వాత కూడా ఆయన పార్థివ దేహాన్ని అక్కడే ఉంచారని సన్నిహితులు చెప్తున్నారు.

    ఎంత దౌర్భాగ్యం అంటే తన చెల్లెలు పెళ్ళికి కూడా తారకరత్న కి ఆహ్వానం ఇవ్వలేదట అతని తండ్రి మోహన్ కృష్ణ.కొడుకు మీద అంత పగ పెంచేసుకున్నాడట.ఫిలిం ఛాంబర్ లో ఉన్న తారకరత్న పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన మోహన్ కృష్ణ,అలేఖ్య రెడ్డి ని మరియు ఆమె పిల్లల్ని కనీసం పలకరించలేదట.ఈ సంఘటన చూసి అక్కడకి వచ్చిన వాళ్ళందరూ షాక్ కి గురయ్యారు.అందుకే బ్రతికి ఉన్నన్ని రోజులు తారకరత్న తన తల్లితండ్రుల గురించి మాట్లాడడానికి ఏమాత్రం కూడా ఇష్టం చూపేవాడు కాదు.తనకి తండ్రైన, తల్లైనా, అన్నయ్య అయినా,చివరికి దేవుడైన బాలయ్య బాబు మాత్రమే అని చెప్పుకునేవాడు.భవిష్యత్తులో అయినా మోహనకృష్ణ తన మనసు కరిగి కోడలు అలేఖ్య రెడ్డి ని దగ్గరకి తీసుకుంటాడో లేదో చూడాలి.