https://oktelugu.com/

Sara Ali Khan : ఈ టాప్ హీరోయిన్ పిసినారే కాదు, చిల్లర దొంగతనాలు కూడా చేస్తుందట..!

సినిమాలు, ప్రొమోషన్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న సారా అలీ ఖాన్ ఇలా చిల్లర దొంగతనాలు చేయడం, పిసినారితనం చూపించడం విడ్డూరంగా ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2023 / 08:39 PM IST
    Follow us on

    Sara Ali Khan : అన్నీ ఉన్నా చిలిపి దొంగతనాలు చేయడం కొందరికి హాబీ. ఇదో సైకలాజికల్ డిజార్డర్ కూడా. షాపింగ్ మాల్స్, హోటల్స్, స్ట్రీట్ వెండార్స్ వద్ద వస్తువులు కొట్టేయడం కొందరు సరదాగా పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గరకు కోట్ల రూపాయలు ఉన్నా వస్తువులు కొట్టేయడం మజా ఇస్తుంది. ఈ అలవాటు స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ కి కూడా ఉందట. ఆమె తరచుగా వస్తులు దొంగిలిస్తారట. తాను స్టే చేసిన హోటల్ లో వస్తువులు దొంగతనంగా తెచ్చుకుంటుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. ఆమె లేటెస్ట్ మూవీ జరా హట్కే జరా బచ్కే ప్రమోషన్స్ లో పాల్గొన్న విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కొన్ని ఆసక్తిగొలిపే విషయాలు పంచుకున్నారు.

    మీరు ఎప్పుడైనా వస్తువులను దొంగిలించారా అని అడగ్గా… అమ్మతో పాటు ఒకసారి వన్ మంత్ ట్రిప్ కి వెళ్ళాను. మేము తిరిగి వచ్చేటప్పుడు నా బ్యాగ్ పది కేజీలు అధికంగా బరువు పెరిగింది. ఈ ట్రిప్ లో నేను షాంపూలు, కండిషనర్లు, టూత్ పేస్ట్స్, లోషన్స్ అన్నీ దొంగిలించాను. మరోసారి నేను ఇలా చేయకూడదని అమ్మ చెప్పింది. విక్కీ కౌశల్ మాట్లాడుతూ… హోటల్ నుండి వస్తువులు తీసుకెళ్లడం నేను ఇంకా చేస్తున్నాను. అయితే సారా ఎయిర్ పోర్ట్ నుండి ఒక దిండు కొట్టేసింది. మేము ప్రమోషన్స్ కోసం పలు రాష్ట్రాల్లో తిరుగుతున్నాము.

    ఎయిర్ పోర్ట్ లో పది నిమిషాలు ఉపయోగించిన దిండును సారా తనతో తెచ్చేసుకుంది. అది తనకు బాగా నచ్చిందట. ఆ దిండును అనేక రాష్ట్రాలు తిప్పింది, అని చెప్పుకొచ్చాడు. అలాగే డబ్బులు దుబారా చేయడం కూడా సారా అలీ ఖాన్ కి నచ్చదట. ఓ సారి రూ. 1600 ఖర్చు చేసి వాళ్ళ అమ్మ ఓ టవల్ కొన్నారట. టవల్ కి అంత ఖర్చు చేసినందుకు సారాకు కోపం వచ్చిందట. అమ్మ అమృత సింగ్ మీద మండిపడిందట. విదేశాలకు వెళ్ళేటప్పుడు డేటా రోమింగ్ ప్యాక్ కూడా వద్దని సారా అంటుందట. సినిమాలు, ప్రొమోషన్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న సారా అలీ ఖాన్ ఇలా చిల్లర దొంగతనాలు చేయడం, పిసినారితనం చూపించడం విడ్డూరంగా ఉంది.

    మరోవైపు సారా-విక్కీ కౌశల్ కలిసి నటించిన జరా హట్కే జరా బచ్కే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా జరా హట్కే జరా బచ్కే తెరకెక్కింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ వరకూ ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృత సింగ్ కూతురే ఈ సారా అలీ ఖాన్. విడాకులు అనంతరం సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ని వివాహం చేసుకున్నాడు.