https://oktelugu.com/

Rana Naidu : స్టార్ హీరోలైన వెంకటేష్ – రానాలకు ఏంటి దుస్థితి

Rana Naidu : టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఏ స్టార్ హీరో కి ఫ్యామిలీస్ లో మంచి ఫాలోయింగ్ వచ్చినా విక్టరీ వెంకటేష్ తో పోల్చి చూస్తారు. మూడు దశాబ్దాల సినీ కెరీర్ ద్వారా ఆయన సృష్టించుకున్న ఇమేజి అలాంటిది.ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ, స్టార్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఇచ్చే రేంజ్ లో ఉన్నాడంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 8, 2023 / 09:06 PM IST
    Follow us on

    Rana Naidu : టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఏ స్టార్ హీరో కి ఫ్యామిలీస్ లో మంచి ఫాలోయింగ్ వచ్చినా విక్టరీ వెంకటేష్ తో పోల్చి చూస్తారు. మూడు దశాబ్దాల సినీ కెరీర్ ద్వారా ఆయన సృష్టించుకున్న ఇమేజి అలాంటిది.ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ, స్టార్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఇచ్చే రేంజ్ లో ఉన్నాడంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

    అంతే కాకుండా టాలీవుడ్ లో మాయం అయిపోయిన మల్టిస్టార్రర్ మూవీ ట్రెండ్ ని మరోసారి ప్రారంభించింది ఆయనే.మహేష్ బాబు తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా దగ్గర నుండి మొన్న వచ్చిన F3 వరకు వెంకటేష్ చేసినన్ని మల్టిస్టార్రర్ సినిమాలు టాలీవుడ్ లో ఏ హీరో కూడా చేసి ఉండదు,అయితే ఆయన తన అబ్బాయి రానా దగ్గుపాటి తో కలిసి ‘రానా నాయుడు’ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెల్సిందే.

    విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ ఇది, నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ ని నిర్మించింది.హాలీవుడ్ లో భారీ హిట్ గా నిల్చిన ‘రెయ్ డొనోవెన్’ అనే టీవీ సిరీస్ ని ఆధారంగా తీసుకొని చేస్తున్న ఈ వెబ్ సిరీస్ కోసం దగ్గుపాటి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఇప్పటి వరకు విడుదల కాకపోవడం పై వెంకటేష్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

    ఇందులో వెంకటేష్ తెల్లని జుట్టుతో ముసలివాడిగా కనిపించడం చూసి అందరూ షాక్ కి గురయ్యారు..చాలా కాలం తర్వాత వెంకటేష్ ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో మన ముందుకి రాబోతున్నాడు, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ప్రతీసారి నిరాశే ఎదురౌతుంది..ఇప్పటికీ ఈ సిరీస్ విడుదల తేదీ ఏంటో తెలియదు.మరి అభిమానులకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎప్పుడు ఉపశమనం కలిగిస్తుందో చూడాలి.