Homeఎంటర్టైన్మెంట్Venkatesh And Anil Ravipudi: అనిల్ రావిపూడి కోసం వెంకటేష్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడా..?

Venkatesh And Anil Ravipudi: అనిల్ రావిపూడి కోసం వెంకటేష్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడా..?

Venkatesh And Anil Ravipudi: కమర్షియల్ సినిమాలతో సక్సెస్ లను సాధించడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. కానీ అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు మాత్రం చేసిన సినిమాలన్నింటితో సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాడు. ఇక ఇలాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా 100% సక్సెస్ రేట్ ను కలిగి ఉన్న దర్శకుడిగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అలాంటి దర్శకుడు ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. బావ బామ్మర్దుల నేపథ్యంలో ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. అయితే ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక డిఫరెంట్ కోణంలో ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన ప్రొడ్యూసర్ అనిల్ రావిపూడి తో ఈ విషయాన్ని చర్చించారట.

అనిల్ మాత్రం వెంకటేష్ ని కొంతవరకు తన రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పారట. దాంతో వెంకటేష్ సైతం సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి తన రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని తగ్గించాడు. సినిమా సక్సెస్ అయిన తర్వాత అతనికి మిగిలిన మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రొడ్యూసర్లు సైతం ఒక క్లారిటీ తో ఉన్నారట.

ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు వరుస సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఇక వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోయే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అనిల్ రావిపూడి వరుసగా తొమ్మిది విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పదోవ విజయాన్ని సైతం సాధించి వరుసగా 10 సక్సెస్ లను అందుకున్న దర్శకుడిగా పేరు పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version